MS Dhoni IPL Impact Player | ధోనీ ఐపీఎల్ ఫ్యూచర్‌పై బద్రీనాథ్ సంచలన వ్యాఖ్యలు

Continues below advertisement

ఐపీఎల్‌లో చెన్నై సూపర్ కింగ్స్ మాజీ బ్యాటర్ సుబ్రమణ్యం బద్రీనాథ్.. మహేంద్ర సింగ్ ధోని ఐపీఎల్ ఫ్యూచర్‌పై కీలక విషయాలను వెల్లడించాడు. ధోని ఇంపాక్ట్ ప్లేయర్‌గా మైదానంలోకి అడుగుపెట్టే అవకాశం లేదని, పూర్తి స్థాయి వికెట్ కీపర్‌గా 20 ఓవర్ల పాటు గ్రౌండ్‌లోనే ఉండటానికి మొగ్గు చూపుతున్నాడని తెలిపాడు.

"తాను ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఆడబోనని ధోని నాతో స్వయంగా చెప్పాడు. అతడు తనను తాను ఫుల్ టైమ్ కీపర్‌గానే చూసుకుంటున్నాడు. అయితే ఫీజికల్ గా స్ట్రైన్ అవకుండా ధోని 16వ ఓవర్ తర్వాత బ్యాటింగ్‌కు వచ్చి, వికెట్ కీపింగ్ మాత్రమే చేస్తూ ఇంపాక్ట్ ప్లేయర్‌గా ఉంటే సీఎస్కేకు టాక్టికల్‌గా ఎంతో మేలు జరుగుతుంది" అని పేర్కొన్నాడు. 

ధోని శరీరం ఎక్కువ సేపు ప్రెషర్ తట్టుకోలేదని కోచ్ స్టీఫెన్ ఫ్లెమింగ్ కూడా గతంలోనే వెల్లడించిన విషయాన్ని గుర్తుచేశాడు. ఇదే క్రమంలో సీఎస్కే మేనేజ్‌మెంట్‌పై బద్రీనాథ్ తీవ్ర విమర్శలు చేశాడు. ఇంపాక్ట్ ప్లేయర్ నిబంధన వల్లే శివం దూబేకు సీఎస్కేలో బౌలింగ్ అవకాశాలు రాలేదన్న వాదనలను అతడు కొట్టిపారేశాడు. టీమిండియా తరఫున రెగ్యులర్‌గా బౌలింగ్ చేస్తున్న దూబేను బంతితో సరిగ్గా ఉపయోగించుకోవడంలో చెన్నై మేనేజ్‌మెంట్ విఫలమైందని మండిపడ్డాడు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola