బోర్డర్ గవాస్కర్ ట్రోఫీకి సిద్ధమైన టీమ్ ఇండియా

Continues below advertisement

 రీసెంట్ ఇయర్స్ లో టెస్ట్ క్రికెట్ లో టీమిండియా ఫ్యాన్స్ కి బాగా అలరిస్తున్న సిరీస్ ఏదన్నా ఉందీ అంటే అది బోర్డర్ గవాస్కర్ ట్రోఫీనే. 2018,2020 సంవత్సరాల్లో జరిగిన రెండు సిరీస్ ల్లోనూ ఆస్ట్రేలియాను ఆస్ట్రేలియాలోనే మట్టికరిపించింది టీమిండియా. ప్రత్యేకించి 2020-21 సిరీస్ అయితే అభిమానులు ఎప్పటికీ మర్చిపోలేరు. 32ఏళ్ల తర్వాత గబ్బాలో ఆస్ట్రేలియాకు ఓటమి రుచి చూపించిన తొలి జట్టుగా నిలబడింది భారత్. ఇప్పటివరకూ 16సార్లు బోర్డర్ గవాస్కర్ ట్రోఫీ గెలిస్తే..ఇండియాదే డామినేషన్. 10 సార్లు భారత్ గెలిచింది. ఐదుసార్లు ఆస్ట్రేలియా గెలిచింది. ఓసారి డ్రా అయ్యింది. లాస్ట్ రెండు సార్లు ఆస్ట్రేలియాని ఆస్ట్రేలియాలోనే ఓడించాం. ప్రత్యేకించి ఛతేశ్వర్ పుజారా, రిషభ్ పంత్ ఈ రెండు సిరీసుల్లో భారత్ కు అపురూపమైన విజయాలు అందించారు. ఈ రెండు సిరీసుల్లోనూ బ్యాట్ తో భారత్ కు కొండంత అండలా నిలిచిన ఛతేశ్వర్ పుజారా లేకపోవటం ఈసారి కచ్చితంగా లోటు. కానీ విరాట్ కొహ్లీ, రోహిత్ శర్మలపై ఈసారి భారత్ కొండంత ఆశలు పెట్టుకుంది. బాబు పుట్టడంతో రోహిత్ ఫస్ట్ టెస్ట్ కి ఆడటం లేదు.  సో పెర్త్ లో జరుగుతున్న ఫస్ట్ టెస్ట్ కి వైస్ కెప్టెన్ బుమ్రానే కెప్టెన్ గా వ్యవహరిస్తాడు. ఇప్పటికే ఆస్ట్రేలియా కెప్టెన్ ప్యాట్ కమిన్స్, టీమిండియా కెప్టెన్ బుమ్రా ఫోటో షూట్ కూడా చేశారు. రెండు జట్లకూ బౌలర్లే కెప్టెన్ గా ఉండటం ఓ అరుదైన సన్నివేశమని కూడా చెప్పుకోవచ్చు. 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram