Morne Morkel Backs Vaibhav Suryavanshi | వైభవ్ పై మోర్నీ మోర్కెల్ ఆసక్తికర వ్యాఖ్యలు

Continues below advertisement

టీమిండియా టీనేజ్ సెన్సేషన్ వైభవ్ సూర్యవంశీకి ప్లేయింగ్ 11 లో ఛాన్స్ దొరకకపోయినా పెద్దగా నష్టం ఏమీ లేదని భారత బౌలింగ్ కోచ్ మోర్నీ మోర్కెల్ అంటున్నారు. వెస్టిండీస్‌తో టీ20 సిరీస్‌ ప్రారంభంకానున్న నేపథ్యంలో మోర్నీ  కామెంట్స్ చేశారు.

ప్రస్తుతం టీమ్ లో ఉండడతో వైభవ్‌కు సీనియర్ ప్లేయర్స్ నుంచి ఎన్నో విషయాలు నేర్చుకునే అద్భుతమైన అవకాశం లభిస్తుందని మోర్కెల్ అన్నారు. వైభవ్ టాలెంట్ గురించి ప్రత్యేకంగా చెప్పనవసరం లేదని, అటువంటి టాలెంటెడ్ ప్లేయర్ ఈ ఎన్విరాన్మెంట్ లో ఎంత ఎక్కువ కాలం ఉంటె అతని ఫ్యూచర్ అంత మంచిదని అభిప్రాయపడ్డారు. 

ఒకవేళ అతనికి ప్లేయింగ్ ఎలెవన్‌లో ఆడే అవకాశం రాకపోయినా.. డగౌట్‌లో కూర్చోవడం, సీనియర్లతో కలిసి ట్రావెల్ చేయడం ద్వారా మ్యాచ్ పరిస్థితులను అర్థం చేసుకోవచ్చని తెలిపారు. మరోవైపు, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ మాట్లాడుతూ.. సంజూ శాంసన్, అభిషేక్ శర్మ ఓపెనింగ్ జోడీని ఇప్పుడే మార్చలేమని, వైభవ్ ఇంకొన్నాళ్లు వేచి చూడాల్సి ఉంటుందని స్పష్టం చేశారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola