Mohammed Siraj unexpected entry in India vs US T20WC | వరల్డ్ కప్‌లో మియా భాయ్ మేజిక్

Continues below advertisement

భారత ఫాస్ట్ బౌలర్ మహ్మద్ సిరాజ్ కు ( Mohammed Siraj ) గత కొంత కాలంగా టీ20 ఫార్మాట్‌లో అవకాశాలు లేవు. టీ20 ప్రపంచకప్ ( T20 World Cup ) జట్టులో చోటు దక్కుతుందన్న ఆశలు కూడా వదులుకున్న సిరాజ్.. ఇప్పుడు టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది.

హర్షిత్ రాణా ( Harshit Rana ) గాయపడటంతో సిరాజ్ అనూహ్యంగా టీమ్ లో చేరాడు. తాను సడన్ గా టీమ్ లో చేరడంపై సిరాజ్ ఆసక్తికర విషయాలు పంచుకున్నాడు. టీ20 ప్రపంచకప్ కోసం టీమిండియా ప్రాక్టీస్ చేస్తున్న టైంలో, సిరాజ్ తన పనుల్లో బిజీగా ఉన్నాడు. ఫిబ్రవరి 15న స్పెయిన్ వెళ్లాలని, ఆ తర్వాత రంజాన్ మాసంలో కుటుంబంతో గడపాలని ప్లాన్ చేసుకున్నాడు. కానీ తను అనుకున్నట్టుగా మాత్రం జరగలేదు. 

"నేను ఇంట్లో ఉన్నప్పుడు సూర్య భాయ్ ( Suryakumar Yadav ) నుంచి ఫోన్ వచ్చింది. 'మియా.. రెడీ అయిపో, నీ బ్యాగ్ ప్యాక్ చేసుకుని వెంటనే వచ్చేయ్' అని చెప్పారు. అది విన్న నేను 'సూర్య భాయ్.. నాతో జోకులు వేయకండి' అని అన్నాను. కానీ ఇది నిజమని తెలిశాక చాలా షాక్ అయ్యాను. అది నిజంగా దేవుడి దయ" అని సిరాజ్ అన్నాడు.  

కేవలం టీమ్ లోకి రావడమే కాకుండా, బుమ్రా ( Jasprit Bumrah ) అనారోగ్యం కారణంగా నేరుగా తుది జట్టులో అవకాశం దక్కించుకున్నాడు సిరాజ్. వచ్చిన అవకాశాన్ని వదులుకోకుండా అమెరికాపై జరిగిన మ్యాచ్‌లో 4 ఓవర్లలో 29 పరుగులు ఇచ్చి 3 కీలక వికెట్లు పడగొట్టి తన సత్తా చాటాడు. "విమానంలో వరల్డ్ కప్ టీమ్‌తో ప్రయాణించడం నాకు ఒక కలలా అనిపించింది. రంజీల్లో ఏ లైన్ అండ్ లెంగ్త్‌తో బౌలింగ్ చేశానో, ఇక్కడ కూడా అదే ప్లాన్ అమలు చేశాను" అని చెప్పుకొచ్చాడు సిరాజ్.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola