Mohammed Siraj in England Test Series | సంచలనం సృష్టించిన సిరాజ్

Continues below advertisement

మహమ్మద్ సిరాజ్..ఇండియా ఇంగ్లాండ్ మధ్య జరిగిన టెస్ట్ సిరీస్ లో ది రియల్ హీరో. ఐదు టెస్టులు ఆడిన ఏకైక పేసర్ సిరాజ్ మాత్రమే.  బ్యాటింగ్‌కు అనుకూలంగా ఉండే పిచులపై కూడా తన బౌలింగ్ తో వికెట్స్ పడగొట్టి అందర్నీ అక్కటుకునాడు. ఓవల్ టెస్టులో సంచలనం సృష్టించాడు. అవుట్ స్వింగ్, యార్కర్ బౌలింగ్‌లో ప్రత్యర్థులకు చుక్కలు చూపించాడు. ఇంగ్లాండ్ గెలవడానికి కేవలం ఆరు పరుగులు మాత్రమే మిగిలున్న టైం లో చివరి వికెట్ తీసి ఇండియాకు చారిత్రక విజయాన్ని అందించాడు. అలాగే 5 వికెట్ల హాల్ ను కూడా సాధించాడు. 

బుమ్రా, సిరాజ్ తో మెయిన్ పేసేర్లుగా టీం ఇండియా ఈ సిరీస్ ను మొదలు పెట్టింది. కానీ వర్క్ లోడ్ కారణంగా బుమ్రా కేవలం 3 మ్యాచులు మాత్రమే ఆడతాడని ముందే ప్రకటించారు. బుమ్రా లేకపోవడంతో భారమంతా సిరాజ్ పైనే పడింది. మిగితా పేసర్లు ఉన్నప్పటికీ కూడా వాళంతా ఇప్పుడు ఇప్పుడే టీం లోకి వస్తున్నారు. మొదటి టెస్ట్ లో 5 వికెట్ హౌల్ సాధించిన బుమ్రా ఆ తర్వాత మ్యాచులో విఫలమైయ్యాడు. ప్రస్తుతం ఉన్న మూడు ఫార్మాట్స్ లో బుమ్రా సిరాజ్... కీలక పేసర్లు. కానీ బుమ్రా గాయాలతో ఎన్నో మ్యాచులకు దూరమైయ్యాడు. ముఖ్యంగా ఈ టెస్ట్ సిరీస్ లో వర్క్ లోడ్ అంటూ కేవలం మూడు మ్యాచులు మాత్రమే ఆడాడు. ప్రస్తుతం బుమ్రా కంటే సిరాజ్ ఒక అడుగు ముందే ఉన్నాడు. ఫిట్నెస్ పరంగా చూసుకుంటే సిరాజ్ బుమ్రాను మించిన వాడు. సిరాజ్ ఇప్పటి వరకు గాయంతో మ్యాచులకు దూరం అవలేదు. గత ఐదేళ్లుగా తాను సెలెక్ట్ అయిన ప్రతి టెస్ట్ మ్యాచ్ ఆడుతూనే ఉన్నాడు. 135-140 స్పీడ్ తో బౌలింగ్ చేస్తూ ఒక్కో సిరీస్ లో 200 ఓవర్లు వేస్తున్నాడు. 

ఇలా రోజు రోజుకి తన ప్రదర్శనతో టీం విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. ఒకప్పుడు టీం ఇండియా కష్టాలో ఉంటె బుమ్రా ఉన్నాడులే అని అందరు అనుకునేవారు. కానీ ఇప్పుడు బుమ్రా లేకపోతేనేం సిరాజ్ ఉన్నాడులే అన్న నమ్మకాని తన ఫ్యాన్స్ నుంచి సాధించాడు సిరాజ్.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola