Mohammed Shami SRH Trade | SRH పై డేల్ స్టెయిన్ ఆగ్రహం
ఐపీఎల్ 2026 సీజన్‌కి ముందు అన్ని టీమ్స్ లో రేటెన్షన్ రూపంలో కీలక పరిణామాలు చోటు చేసుకున్నాయి. ఎవరు ఊహించని విధంగా ప్లేయర్స్ ను రిటైర్ తోపాటు ట్రేడ్ చేసుకున్నాయి ఫ్రాంచైజీలు. అయితే సన్‌రైజర్స్ హైదరాబాద్ మాత్రం తాము తీసుకున్న రిటెన్షన్ నిర్ణయంపై ట్రోల్స్ ఎదుర్కుంటుంది.
SRH పేసర్ మహ్మద్ షమీని లక్నో సూపర్ జెయింట్స్ ట్రేడ్ చేసుకుంది. ఐపీఎల్ 2025 ఆక్షన్ లో 10 కోట్లకు మహ్మద్ షమీని దక్కించుకుంది SRH. ఇప్పుడు అదే 10 కోట్లకు లక్నో సూపర్ జెయింట్స్ షమిని తీసుకుంది. సన్‌రైజర్స్ హైదరాబాద్ తీసుకున్న ఈ నిర్ణయంపై కేవలం ఫ్యాన్స్ మాత్రమే కాదు ... SRH మాజీ బౌలింగ్ కోచ్ డేల్ స్టెయిన్ కూడా అసంతృప్తి వ్యక్తం చేసారు. నేను సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ కు బౌలింగ్ కోచ్‌గా ఉన్నప్పుడు మహ్మద్ షమీని ఎలాగైనా టీమ్‌లోకి తీసుకోవాలని మేనేజ్‌మెంట్‌ని అడిగాను. కానీ నేను టీమ్ నుంచి బయటికి వచ్చిన తర్వాత షమి సన్‌రైజర్స్ హైదరాబాద్‌లోకి వెళ్లాడు. ఒక్క సీజన్‌కే అతన్ని ఇలా టీమ్ లో నుంచి పంపడం నాకు అస్సలు నచ్చలేదు. ఫిట్‌నెస్, ఫామ్ వల్లే సన్‌రైజర్స్ హైదరాబాద్ టీమ్ మహ్మద్ షమీ లాంటి ప్లేయర్‌ని రిటైన్ చేసుకోవడానికి ఆసక్తి చూపించి ఉండదు. షమీ, ఫిట్‌గా ఉండి ఫామ్‌లో ఉంటే ఎలాంటి బ్యాటర్‌ని అయినా ఇబ్బంది పెట్టగలడు. అలాంటి మహ్మద్ షమీని వేలానికి వదిలేసి, ఎవరిని కొనాలని అనుకుంటున్నారు? షమీ లాంటి టాలెంట్ ఉన్న ప్లేయర్‌ని మళ్లీ కావాలని అనుకున్నా తిరిగి టీమ్‌లోకి తీసుకురాలేరు..’ అంటూ కామెంట్ చేశాడు.