టీమిండియా ప్లేయర్ల కెరీర్ ని సెలెక్టర్లు నాశనం చేస్తున్నారు: మహమ్మద్ కైఫ్
టీమిండియా సెలెక్టర్లపై మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ షాకింగ్ కామెంట్స్ చేశాడు. సెలెక్టర్ల చెత్త డెసిషన్స్ వల్ల టీమిండియాకు తీవ్ర నష్టం జరిగిందని మండిపడ్డాడు. ‘టీ20 ఫార్మాట్‌లో శుభ్‌మన్ గిల్ కంటే మెరుగైన ఆటగాళ్లు జట్టులో ఉన్నారని సెలెక్టర్లకు తెలుసు. ఈ ఒక్క ఫార్మాట్‌లోనే శుభ్‌మన్ గిల్ కంటే మెరుగైన ఆటగాళ్లు ఉన్నారు. కానీ సెలెక్టర్లు ఇది తెలిసి కూడా తప్పు చేశారు. వారి తప్పిదం వల్ల భారత క్రికెట్ వెనక్కి వెళ్లిపోయింది. వారి అనాలోచిత నిర్ణయాల కారణంగా గత రెండు, మూడు నెలలుగా జైస్వాల్, శాంసన్, జితేష్ శర్మలకు తగిన అవకాశాలు ఇవ్వలేకపోయారు. వారికి అవకాశం ఇచ్చి ఉండాల్సింది. అంతే కాకుండా అక్షర్ పటేల్‌ను వైస్ కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పించి గిల్ అప్పగించారు. తిరిగి మళ్లీ అతనికే వైస్ కెప్టెన్సీ ఇచ్చారు. ఈ నిర్ణయం వల్ల అక్షర్ పటేల్ కెప్టెన్సీ స్కిల్స్ మెరుగుపర్చుకునే కీలక సమయం వెస్ట్ అయింది.' అని మహమ్మద్ కైఫ్ సీరియస్ అయ్యాడు. ఇలాగే కంటిన్యూ అయితే.. 2026 t20 World Cup లోనే కాదు..2027 వన్డే World Cup కూడా మనం గెలిచే ఛాన్స్ ఏమాత్రం ఉండదన్నాడు. మారి కైఫ్ కామెంట్స్ పై మీ ఒపీనియన్ ఎంటి?