Mohammad Siraj | క్రికెట్ ఆడుతుంటే మా నాన్నతో కలిసి ఆటో నడుపుకోమన్నారు

Continues below advertisement

టెస్ట్‌ల్లో టీమిండియా ప్రధాన పేసర్‌గా ఎదిగి.. వెస్టిండీస్‌తో తొలి టెస్ట్‌లో 7 వికెట్లతో టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించిన మహ్మద్ సిరాజ్.. ఇంగ్లండ్‌‌తో సిరీస్‌లోనూ 23 వికెట్లు పడగొట్టి ది బెస్ట్ పేసర్ అనిపించుకున్నాడు. ఇలాంటి టైంలో ఓ ఇంటర్వ్యూలో మాట్లాడిన సిరాజ్.. తన కెరీర్ స్టార్టింగ్‌లో ఎదురైన కొన్ని అనుభవాలని పంచుకున్నాడు.  రీర్‌ ఆరంభంలో తనపై వచ్చిన విమర్శలు, ట్రోల్స్‌ను గుర్తు చేసుకుంటూ.. ‘ఐపీఎల్ 2018లో ఆర్‌సీబీ తరఫున విఫలమైనప్పుడు దారుణమైన ట్రోలింగ్‌ను ఎదుర్కొన్నాను. 'మీ అయ్యతో కలిసి ఆటో నడుపుకో’ అంటూ కొందరు విమర్శలు చేస్తే తట్టుకోలేకపోయాను. అయితే ఆ టైంలో టీమిండియా లెజెండరీ బ్యాటర్ ధోనీ చెప్పిన మాటలు తనలో ఎంతో ఆత్మవిశ్వాసం నింపి మోటివేట్ చేశాయి. ఈ రోజు ఇక్కడివరకు నన్ను నడిపించాయి. ఇతరుల అటెన్షన్ కోసం చూడవద్దని, బాగా ఆడితే మెచ్చుకున్న వ్యక్తులే.. విఫలమైతే తిడతారని.. అది సాధారమైన విషయమే కాబట్టి.. ఆ విషయాలని తల్చుకుని కుంగిపోవద్దంటూ ధోనీ భాయ్ చెప్పిన ఆ ధైర్యమే నన్ను ఇక్కడివరకు నడిపించింది’ అంటూ సిరాజ్ చెప్పుకొచ్చాడు.  ధోనీ చెప్పినట్లే.. అద్భుత ప్రదర్శన కనబర్చినప్పుడు అభిమానులతో పాటు ప్రపంచం మొత్తం మనతో ఉండి.. 'సిరాజ్ లాంటి బౌలర్ లేడు'అని ఆకాశానికెత్తేయడం.. తర్వాత విఫలమైతే మాత్రం 'మీ నాన్నతో వెళ్లి ఆలో నడుపుకో' అనడం అన్నీ చూశాను. అంటే ఓ మ్యాచ్‌లో హీరో అయితే.. మరొక మ్యాచ్ జీరో అవుతామని అప్పుడే అర్థం చేసుకున్నాను. అందుకే బయటి విషయాలను పట్టించుకోవడం మానేశాను.నా గురించి నా సహచరులు, నా కుటుంబం ఏమనుకుంటున్నారనేదే ముఖ్యం. నాకు ముఖ్యమైన వ్యక్తులు వారే. ఇతరుల మాటల గురించి నేను పట్టించుకోను.'అని సిరాజ్ చెప్పిన మాటలు ఇప్పుడు వైరల్ అవుతున్నాయి.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola