Mohammad Siraj about Bumrah Bowling | బుమ్రా లేనప్పుడే వికెట్స్ తీస్తానంటున్న సిరాజ్

టీమిండియా పేసర్ మహమ్మద్ సిరాజ్ తన ప్రదర్శనతో ఫ్యాన్స్ ను బాగా ఆక్కటుకుంటున్నారు. బుమ్రా లేని మ్యాచులో కూడా తన పేస్ బౌలింగ్ తో ప్రత్యర్థులకు చుక్కలు చూపించాడు. అయితే గత కొన్నేళ్ల మ్యాచులు చూసుకుంటే... బుమ్రా లేని ఎన్నో మ్యాచులో టీం ఇండియా గెలిచింది. అందుకు ప్రధాన కారణం మహమ్మద్ సిరాజ్. తాను సెలెక్ట్ అయిన ప్రతి మ్యాచ్ లో ఆడాడు సిరాజ్. వర్క్ లోడ్ మానేజ్మెంట్, లేదా గాయాల కారణంగా ఎప్పుడు మ్యాచులకు దూరం అవలేదు. అందుకు కరెక్ట్ ఉదహరణ ఇంగ్లాండ్ తో జరిగిన టెస్ట్ సిరీస్. 

అయితే బుమ్రా టీంలో లేనప్పుడు ఎందుకు మరింత బాగా బౌలింగ్ చేస్తారన్న దానిపై సిరాజ్‌కు ప్రశ్న ఎదురైంది. అందుకు సిరాజ్ మాట్లాడుతూ.. రెస్పాన్సిబిలిటీ ఉన్నప్పుడు మంచిగా పెర్ఫర్మ్ చేస్తా. రెస్పాన్సిబిలిటీ ఉంటె నాలో మరింత ఉత్సాహం పెరుగుతుందని  అంటున్నాడు. గాయం కారణంగా బుమ్రా మ్యాచులు ఆడలేక పొయ్యాడు. అలాంటి టైంలో ఆ బాధ్యత నాదే అని అంటున్నాడు మహమ్మద్ సిరాజ్. అయితే సిరాజ్ తన బౌలింగ్ తో మంచి ఫార్మ్ కనబరుస్తున్నా కూడా ఆసియా కప్ కు మాత్రం సెలెక్ట్ అవలేక పొయ్యాడు. ఇందుకు సంబంధించి సెలక్షన్ కమిటీపై ఫ్యాన్స్ మండిపడ్డారు. కానీ తాను ఆసియా కప్ లో సెలెక్ట్ అవకపోవడంపై సిరాజ్ మాత్రం ఇప్పటి వరకు స్పందించలేదు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola