Manav Suthar Test Debut in IND vs AFG | జడేజా ప్లేస్‌లోకి సరికొత్త కిల్లర్ స్పిన్నర్

Continues below advertisement

అఫ్గానిస్తాన్‌తో జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్‌లో సరికొత్త రికార్డు నమోదైంది. రాజస్థాన్‌కు చెందిన 23 ఏళ్ల యంగ్ లెఫ్ట్ ఆర్మ్ స్పిన్నర్ మానవ్ సుతార్ అంతర్జాతీయ టెస్ట్ క్రికెట్ లోకి గ్రాండ్ ఎంట్రీ ఇచ్చాడు. మ్యాచ్ కంటే ముందు హర్ష్ దూబే, మానవ్ సుతార్‌లలో ఎవరికి ఛాన్స్ దక్కుతుందనే సస్పెన్స్‌కు తెర దించుతూ.. సీనియర్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ చేతుల మీదుగా మానవ్ డెబ్యూ క్యాప్ అందుకున్నాడు. ఐపీఎల్ 2026 లో గుజరాత్ టైటాన్స్ తరఫున మెరిసిన మానవ్, ఇప్పుడు దేశం తరఫున సత్తా చాటడానికి రెడీ అయ్యాడు.

మానవ్ సుతార్‌కు డొమెస్టిక్ క్రికెట్‌లో మైండ్ బ్లోయింగ్ రికార్డ్ ఉంది. ఇప్పటివరకు ఆడిన 29 ఫస్ట్ క్లాస్ మ్యాచ్‌ల్లోనే ఏకంగా 129 వికెట్లు పడగొట్టి సెలెక్టర్ల దృష్టిని ఆకర్షించాడు. అంతేకాదు, 2021లో అక్షర్ పటేల్ డెబ్యూ చేసిన తర్వాత, ఇండియా తరఫున టెస్ట్ క్యాప్ అందుకున్న ఫస్ట్ స్పెషలిస్ట్ స్పిన్నర్ కూడా మానవే కావడం విశేషం. ప్రస్తుతం టీమ్ మేనేజ్మెంట్ రవీంద్ర జడేజాకు ఒక పర్ఫెక్ట్ లాంగ్ టర్మ్ రీప్లేస్‌మెంట్‌ను వెతికే పనిలో ఉంది. అందుకే మానవ్‌కు ఈ గోల్డెన్ ఛాన్స్ ఇచ్చారు.

ఈ మ్యాచ్‌లో మరొక షాకింగ్ అప్‌డేట్ ఏంటంటే నవంబర్ 2010 తర్వాత, అంటే దాదాపు 16 ఏళ్ల తర్వాత రవిచంద్రన్ అశ్విన్, రవీంద్ర జడేజా ఇద్దరూ ప్లేయింగ్ ఎలెవెన్‌లో లేకపోవడం ఇదే మొదటిసారి. సీనియర్లు లేకుండానే గిల్ కెప్టెన్సీలో యంగ్ టీమ్ బరిలోకి దిగింది. టాస్ గెలిచిన గిల్, ఇక్కడ ఎండ ఎక్కువగా ఉండటం వల్ల పిచ్ స్లో అవుతుందని ఫస్ట్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. మరి ఈ మ్యాచ్ లో మానవ్ సుతార్ ఎన్ని వికెట్లు తీస్తాడో చూడాలి.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola