మహారాష్ట్రలో బీజేపీ సత్తా! ఏ మ్యాజిక్ పని చేసింది?

Continues below advertisement

మహారాష్ట్ర ఎన్నికల్లో బీజేపీ కూటమి గెలుపు ఖాయం అయిపోయింది. అధికార మహాయుతి కూటమి మరోసారి అధికారంలోకి రాబోతోంది. ఆధిక్యాల్లో మ్యాజిక్‌ ఫిగర్‌ అయిన 145ను దాటేసింది. మహాయుతి కూటమిలో BJP, షిండే వర్గపు Shiv Sena, Nationalist Congress Party లు ఉండగా.. ప్రతిపక్ష మహావికాస్‌ అఘాడీ కూటమిలో కాంగ్రెస్ పార్టీ, ఉద్ధవ్ వర్గం శివసేన, శరద్ పవార్ వర్గం నేషనలిస్ట్ కాంగ్రెస్ ఉన్నాయి. మొత్తం 288 శాసనసభ స్థానాలుండగా.. మహాయుతి కూటమి 217 స్థానాల్లో ఆధిక్యంలో కొనసాగుతుండగా.. ప్రతిపక్ష మహావికాస్‌ అఘాడీ కూటమి 55 స్థానాల్లో ముందంజలో ఉంది. 

ఈ ఫలితాల స్వింగ్‌ను బట్టి చూస్తే.. మూడేళ్ల క్రితం మహారాష్ట్రలో జరిగిన రాజకీయ సంక్షోభం, శివసేన పార్టీలో చీలిక ఏర్పడిన పరిణామాలు పెద్దగా ప్రభావం చూపనట్లుగానే కనిపిస్తున్నాయి. శివసేన నుంచి ఏక్ నాథ్ శిండే వేరు కుంపటి పెట్టి.. బీజేపీతో కలిసి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన ఉదంతం.. ఆ కూటమికి బాగా నష్టం చేకూరుస్తుందని భావించారు. కానీ, అనూహ్యంగా మహాయుతి కూటమి ఫలితాల్లో దూసుకుపోయింది. ప్రతిపక్ష మహా వికాస్‌ అఘాడీ కూటమి కనీస పోటీ ఇవ్వలేకపోతోంది. గత లోక్‌సభ ఎన్నికల్లో మాత్రం బీజేపీకి భారీ ఎదురుదెబ్బ తగిలింది. బీజేపీకి సొంతంగా కేవలం 9 సీట్లే వచ్చాయి. అయితే, అసెంబ్లీ ఎన్నికలు వచ్చేసరికి మాత్రం పరిస్థితి పూర్తిగా మారిపోయింది. అసెంబ్లీ ఎన్నికల్లో ఒక్క బీజేపీనే మ్యాజిక్ ఫిగర్ దాటి ఫలితాలు సాధిస్తోంది. సరైన అభ్యర్థుల ఎంపిక, గ్రౌండ్ లెవెల్లో శ్రేణుల కృషి, ఆర్ఎస్ఎస్ మద్దతు కారణంగా బీజేపీ అద్భుతమైన విజయాన్ని సాధించింది. ఎన్నికలకు ముందు మహాయుతి ప్రభుత్వం అమలు చేసిన లడ్కీ బహిన్ యోజన గేమ్ ఛేంజర్‌గా మారిందని ఫలితాలను బట్టి తెలుస్తోంది. అంటే 21 నుండి 65 సంవత్సరాల వయస్సు గల అర్హులైన మహిళలు రూ. 1,500/- ఆర్థిక సాయాన్ని ప్రతి నెలా బటన్ నొక్కి వారి అకౌంట్లలో వేస్తున్నారు. దీనికి women ఓటర్స్ భారీగా అట్రాక్ట్ అయినట్లుగా చెబుతున్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram