Lockie Ferguson 4 Maidens |క్రికెట్ చరిత్రలో సంచలనం సృష్టించిన ఫెర్గూసన్ | ABP Desam

Continues below advertisement

Lockie Ferguson 4 Maidens | 4 ఓవర్లు వేసి 4 మెయిడెన్లు చేయడం సాధ్యమా..! అందులోనూ 3 వికెట్లు కూడా తీసుకోవడం. అంటే..ఇంత వరకు ఎవరు కలలో కూడా ఊహించని ఈ అసాధ్యాన్ని సుసాధ్యం చేశాడు..న్యూజిలాండ్ స్టార్ బౌలర్ ఫెర్గూసన్..!

టీ20 ప్రపంచ కప్ లో భాగంగా... న్యూజిలాండ్ , పాపువా న్యూగిని మధ్య సోమవారం మ్యాచ్ జరిగింది. ఇందులో పసికూనపై ఫెర్గూసన్ విరుచుకుపడ్డాడు. 4 ఓవర్లు బౌలింగ్ వేసి ఒక్క పరుగు కూడా ఇవ్వలేదు. అంతేకాకుందా కీలకమైన 3 వికెట్లు కూడా పడగొట్టాడు. దీంతో ప్రత్యర్థి జట్టు 78 పరుగులకే కుప్పకూలింది. ఇప్పటికే సూపర్‌-8కు దూరమైన న్యూజిలాండ్‌ ఘనవిజయంతో టోర్నీని ముగించింది. టీ20 చరిత్రలో.. కెనడా కెప్టెన్‌ సాద్‌ బిన్‌ జాఫర్‌ తర్వాత నాలుగుకు నాలుగు ఓవర్లూ మెయిడెన్లు వేసిన రెండో బౌలర్‌గా అతడు నిలిచాడు. ఇక..బౌల్ట్ కూడా 2 వికెట్లు తీసుకున్నాడు. అంతర్జాతీయ క్రికెట్‌ నుంచి రిటైరవుతున్నట్లు ప్రకటించిన కివీస్‌ బౌలర్‌ బౌల్ట్‌కు తన లాస్ట్ మ్యాచ్ ను నిన్నటితో ముగించాడు. 

 

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram