Kumar Sangakkara as RR Head Coach | రాజస్థాన్‌ రాయల్స్‌ కోచ్‌గా సంగక్కర

Continues below advertisement

కొత్త సీజన్ కు ముందు ఏ ఫ్రాంచైజిలో అయినా మార్పులు అనేవి సహజం. కానీ ఐపీఎల్ 2026 కు ముందు మాత్రం ఎవరు ఊహించనటువంటి మార్పులు జరుగుతున్నాయి. అందులో మరొక్కటి రాజస్థాన్ రాయల్స్ టీమ్ కోచ్ గా శ్రీలంక మాజీ కెప్టెన్ కుమార సంగక్కరకు భాద్యతలు అప్పగించడం. గత సీజన్‌లో డైరెక్టర్ ఆఫ్ క్రికెటర్‌గా వ్యవహరించిన సంగక్కర, ఈసారి రాహుల్ ద్రావిడ్ స్థానంలో హెడ్ కోచ్ గా నియమితులయ్యారు. 

సంగక్కర 2021 నుంచి 2024 వరకు రాజస్థాన్ రాయల్స్ హెడ్ కోచ్‌గా ఉన్నారు. సంగక్కర కోచ్ గా రాజస్థాన్ రాయల్స్ 2022 ఫైనల్‌కి చేరింది, 2024లో ప్లేఆఫ్స్‌కి క్వాలిఫై అయ్యింది. ఇక 2025లో రాహుల్ ద్రవిడ్‌ను ఫ్రాంచైజీ కోచ్ గా నియమించింది. సీజన్ ముగిసిన వెంటనే ద్రవిడ్ ఆ ప్లేస్ కు రాజీనామా చేశాడు. ద్రవిడ్ కోచ్‌గా 2025 సీజన్‌లో రాజస్థాన్ కేవలం 8 పాయింట్లతో తొమ్మిదవ స్థానంలో నిలిచింది. అంతేకాకుండా ద్రవిడ్ - సంజు శాంసన్ మధ్య విభేదాలు కూడా ఇందుకు కారణం కావొచ్చు అని అంటున్నారు నిపుణులు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola