Kranti Goud India vs Pakistan ODI | బౌలింగ్ తో అదరగొట్టిన క్రాంతి గౌడ్
ఇండియా పాకిస్తాన్ మధ్య జరిగిన మ్యాచ్ లో టీమిండియాకు చెందిన 22 ఏళ్ల పేసర్ క్రాంతి గౌడ్ ప్రత్యర్థి బ్యాట్స్మన్ కు చుక్కలు చూపించింది. బౌలింగ్, బ్యాటింగ్ తో టీమ్ ఇండియా విజయంలో కీలక పాత్ర పోషించింది. 49వ ఓవర్‌లో బ్యాటింగ్ కు వచ్చిన క్రాంతి ... ఆడింది రెండు ఓవర్లే. ఆ తర్వాత తన అసలు సత్తా బౌలింగ్‌లో చూపించింది.
క్రాంతి మొదటి నుంచే పాకిస్తాన్ ప్లేయర్స్ ను రన్స్ తీయకుండా కట్టడి చేయడం మొదలు పెట్టింది. 8వ ఓవర్‌లో సదఫ్ షమ్స్‌ను అవుట్ చేసింది. ఆ తర్వాత 12వ ఓవర్‌లో ఆలియా రియాజ్‌ను పెవిలియన్ పంపించింది. కొద్దీ సేపటి తర్వాత పాకిస్తాన్ బ్యాట్స్మన్ భాగస్వామ్యాన్ని బ్రేక్ చేయడానికి కెప్టెన్ హర్మన్‌ప్రీత్ కౌర్ ... క్రాంతిని పిలిచింది. మొదటి బాల్ కె పార్టనర్ షిప్ బ్రేక్ చేస్తూ నటాలియా పర్వేజ్‌ను అవుట్ చేసింది. ఇలా 10 ఓవర్లలో కేవలం 20 పరుగులు ఇచ్చి 3 వికెట్లు పడగొట్టింది క్రాంతి. తన అద్భుత ప్రదర్శనతో తోలి వరల్డ్ కప్ టోర్నమెంట్ లోనే ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును సొంతం చేసుకుంది.
మధ్యప్రదేశ్ లోని ఒక చిన్న పల్లెటూరు నుంచి వచ్చిన క్రాంతి .. ఎన్నో సవాళ్లను ఎదుర్కొంటు ఇక్కడి వరకు వచ్చింది. తనకు క్రికెట్ ఆడాల్సిన అవసరం లేదని ఊరంతా చెప్పినా కూడా .. తన కుటుంబం సహాయంతో తన లక్ష్యాన్ని సాధించింది.