పెర్త్ పిచ్‌పై రోహిత్, కోహ్లీకి కష్టాలు తప్పవా?

Continues below advertisement

ఆస్ట్రేలియా ఇండియా మ్యాచ్ అంటేనే ఎంతో రసవత్తరంగా ఉంటుంది. ఇక ఆసీస్ గడ్డపై సిరీస్ అంటే మాములుగా ఉండదు. ప్రతిష్టాత్మకమైన ఈ ఆస్ట్రేలియా సిరీస్ లో అందరి కన్ను రోహిత్ - కోహ్లిపైనే ఉంది.  రోహిత్ శర్మ , విరాట్ కోహ్లి ఛాంపియన్స్ ట్రోఫీ గెలిచిన తర్వాత ఆడే తోలి సిరీస్ ఇదే. అయితే వీరిద్దరి ప్రదర్శనపై ఎన్నో కామెంట్స్, ట్రోల్స్ వస్తున్నాయి. ఇలాంటి టైం లో క్రికెట్ విశ్లేషకులు మాటలతో ఫ్యాన్స్‌ టెన్షన్ లో పడ్డారు. 
తొలి వన్డే మ్యాచ్ పెర్త్ లోని ఆప్టస్ స్టేడియంలో జరగనుంది. ఈ పిచ్ ఇద్దరు సీనియర్స్ కి ఇబ్బందిగా మారవచ్చని అంటున్నాడు మాజీ క్రికెటర్ ఆకాశ్ చోప్రా. 

“పెర్త్‌లో మొదటి మ్యాచ్ కాస్త కష్టం కావచ్చు. అక్కడ బౌన్స్ ఎక్కువగా ఉంటుంది. ఇద్దరూ ఐపీఎల్ తర్వాత మొదటిసారి ఇంటర్నేషనల్ క్రికెట్ ఆడుతున్నారు. బౌన్సింగ్ పిచ్‌పై త్వరగా అవుటయ్యే ఛాన్స్ ఉంది. అడిలైడ్, సిడ్నీ పిచ్‌లపై సర్దుకుపోతారు” అని అన్నాడు. ఆకాశ్ చోప్రా మాటలతో ఫ్యాన్స్ కంగారు పడుతున్నారు. కానీ తమ అభిమాన క్రికెటర్స్ ఈ వన్ డే సిరీస్ లో గొప్ప ప్రదర్శన కనబర్చి.. ట్రోల్స్ చేస్తున్న వారికీ సమాధానం చెప్తారని ఫ్యాన్స్ ఆశిస్తున్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola