KL Rahul Wicket in IND vs AFG Test | కేఎల్ రాహుల్ యాక్టింగ్ పై నెటిజన్ల ట్రోలింగ్
ఆఫ్గానిస్తాన్‌తో జరుగుతున్న ఏకైక టెస్ట్ మ్యాచ్ తొలిరోజే ఒక రేంజ్ డ్రామా నడిచింది. టీమిండియా స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ గ్రౌండ్‌లో చేసిన యాక్టింగ్‌కు మాజీ క్రికెటర్లే ఫిదా అయిపోయారు. ఇంతకీ ఏం జరిగిందంటే జియావుర్ రెహమాన్ వేసిన బౌలింగ్‌లో రాహుల్ బ్యాట్‌కు బాల్ క్లియర్ గా తగిలి కీపర్ చేతుల్లోకి వెళ్ళింది. టీవీ రీప్లే లో అది స్పష్టంగా కనిపించినా అఫ్గాన్ టీమ్ అప్పీల్ చేయలేదు, రివ్యూ కూడా తీసుకోలేదు.
కామెంట్రీలో ఉన్న ఇంగ్లాండ్ మాజీ స్పిన్నర్ గ్రేమ్ స్వాన్ నవ్వుకుంటూ అదిరిపోయే కామెంట్స్ చేశాడు. కేఎల్ రాహుల్ ఇక్కడ సూపర్ మైండ్ గేమ్ ఆడాడని అఫ్గాన్ కెప్టెన్, కీపర్ తన వైపు చూడగానే, తనేమీ ఎడ్జ్ చేయలేదన్నట్లు తల ఊపుతూ యాక్ట్ చేశాడన్నాడు. ఈ రేంజ్ యాక్టింగ్ చేసిన రాహుల్‌కు ఆస్కార్ అవార్డు ఇవ్వొచ్చంటూ స్వాన్ జోకులు వేశాడు. ఆ లైఫ్‌తో చెలరేగిన రాహుల్, 100 రన్స్‌తో కెరీర్‌లో 12వ టెస్ట్ సెంచరీ కొట్టడం విశేషం.
ఇక శుభ్‌మన్ గిల్ కెప్టెన్ ఇన్నింగ్స్‌తో దుమ్ములేపాడు. 103 రన్స్‌తో అజేయ సెంచరీ కొట్టాడు. రిషభ్ పంత్ కూడా 50 రన్స్‌తో నాటౌట్‌గా నిలిచాడు.