KL Rahul about IPL Captaincy | కెప్టెన్సీపై కేఎల్ రాహుల్ సంచలన కామెంట్స్

Continues below advertisement

స్టార్ బ్యాట్స్‌మన్ కేఎల్ రాహుల్ ఐపీఎల్ లో కెప్టెన్సీ చేయడం ఎంత కష్టమో చెప్పుకొచ్చాడు. పంజాబ్ కింగ్స్, లక్నో సూపర్ జెయింట్స్ టీమ్ కు కెప్టెన్ గా వ్యవహరించిన రాహుల్ ఇంటర్నేషనల్ క్రికెట్లో కెప్టెన్ అవ్వడం కంటే చాలా ఐపీఎల్ లో చాలా కష్టమని తెలిపాడు. 

IPL కెప్టెన్సీ కేవలం మైదానంలో నిర్ణయాలు తీసుకోవడం వరకే పరిమితం కాదన్నాడు. దీనితో పాటు కెప్టెన్ మానేజ్మెంట్, డేటా ఎనాలిసిస్, నెట్ సెషన్లు, మ్యాచ్‌కు ముందు, మ్యాచ్ తర్వాత లెక్కలేనన్ని మీటింగ్స్, ప్లాన్స్ ఉంటాయి అని అంటున్నాడు. వీటన్నింటి రిపోర్ట్ ను మల్లి టీమ్ యజమానులకు సమర్పించాల్సి ఉంటుంది. అన్ని బాధ్యతల మధ్య తాను బ్యాటింగ్ లో ఒత్తిడి ఎదుర్కొంటున్నట్లు కొన్నిసార్లు చెప్పాడు. 

కేవలం 2 నెలల IPL ముగిసే సమయానికి ఇంటర్నేషనల్ క్రికెట్ ఏడాది సీజన్ కంటే ఎక్కువ అలసిపోయానని రాహుల్ తెలిపాడు. IPL జట్టు యజమానుల కొన్ని ప్రశ్నలు కెప్టెన్, కోచ్ లపై మరింత ఒత్తిడిని కలిగిస్తాయని రాహుల్ వెల్లడించాడు. క్రికెట్ గురించి పెద్దగా అవగాహన లేని యజమానులు కొన్నిసార్లు అర్థం లేని ప్రశ్నలు వేస్తారని కీలక వ్యాఖ్యలు చేశాడు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola