KKR vs LSG Catch Controversy IPL 2026 | ఐపీఎల్‌లో అంపైరింగ్ పై కైఫ్ ఆగ్రహం

ఐపీఎల్ 2026లో అంపైరింగ్ స్టాండర్డ్స్ చర్చనీయాంశంగా మారాయి. కేకేఆర్, లక్నో మధ్య జరిగిన మ్యాచ్‌లో ఒక వివాదాస్పద నిర్ణయం మ్యాచ్ ఫలితాన్నే మార్చేసింది. కేకేఆర్ ఓపెనర్ ఫిన్ అలెన్ అవుట్ అయిన తీరుపై ఇప్పుడు క్రికెట్ ప్రపంచం మండిపడుతోంది.

లక్నో పేసర్ వేసిన రెండో ఓవర్‌లో ఫిన్ అలెన్ థర్డ్ మ్యాన్ దిశగా ఒక భారీ షాట్ ఆడాడు. బౌండరీ లైన్ వద్ద ఫీల్డర్ దిగ్వేష్ రతి అద్భుతంగా క్యాచ్ అందుకున్నాడు. అయితే, క్యాచ్ పట్టే క్రమంలో అతని కాలు బౌండరీ రోప్‌ను తాకినట్లు రీప్లేలో స్పష్టంగా కనిపించింది. బౌండరీ రోప్ కూడా కాస్త పక్కకు కదిలింది. కానీ, థర్డ్ అంపైర్ మాత్రం ఏమాత్రం ఆలోచించకుండా అది అవుట్ అని ప్రకటించడంతో అందరూ షాక్‌కు గురయ్యారు.

ఈ నిర్ణయంపై టీమిండియా మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ తీవ్రంగా స్పందించాడు. "ఇంత చెత్త అంపైరింగ్‌ను నేను ఎప్పుడూ చూడలేదు. అది క్లియర్ సిక్స్. ఫీల్డర్ కాలు బౌండరీని తాకింది, రోప్ కదిలింది. తగినంత సమయం ఉన్నప్పుడు అంపైర్ ఎందుకు తొందరపడ్డారు?" అని చురకలంటించాడు. ఐపీఎల్ లాంటి పెద్ద టోర్నీలో ఇలాంటి తప్పిదాలు అంగీకరించలేమని కైఫ్ మండిపడ్డారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola