Kieron Pollard Backs Jasprit Bumrah IPL 2026 | బుమ్రాపై పొలార్డ్ సంచలన వ్యాఖ్యలు

ఐపీఎల్ 2026 సీజన్‌లో ముంబై ఇండియన్స్ కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి. ముఖ్యంగా జస్‌ప్రీత్ బుమ్రా ఫామ్ కోల్పోవడం అందరినీ ఆశ్చర్యానికి గురిచేస్తోంది. సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో జరిగిన మ్యాచ్‌లో బుమ్రా 4 ఓవర్లలో వికెట్ తీయకుండా 54 పరుగులు ఇచ్చాడు. అయితే బుమ్రా ఫార్మ్ పై ముంబై బౌలింగ్ కోచ్ కీరన్ పొలార్డ్ కీలక వ్యాఖ్యలు చేశారు.

ప్రెస్ కాన్ఫరెన్స్‌లో పొలార్డ్ మాట్లాడుతూ.. "ఏ ప్లేయర్ అయినా విఫలమైనప్పుడు విమర్శలు రావడం సహజం. బుమ్రా కూడా మనిషే కదా, అతను కూడా తప్పులు చేస్తాడు. గత కొన్నేళ్లుగా అతను అద్భుతమైన ప్రదర్శన ఇచ్చాడు. కాలం కలిసి రానప్పుడు పాత రికార్డులను గుర్తు చేసుకోవాలి. ఫామ్‌లో లేకపోయినా అతను ఇప్పటికీ మా టీమ్ కు కీలక బౌలర్, వరల్డ్ లోనే బెస్ట్ బౌలర్" అని అన్నారు. 

అయితే ముంబై వరుస ఓటములపై మాట్లాడుతూ తాము ఆశించిన స్థాయిలో ఆడలేకపోతున్నామని పొలార్డ్ చెప్పుకొచ్చారు. ముంబై ఇండియన్స్ ఇంకా ప్లేఆఫ్స్ రేసు నుంచి తప్పుకోలేదని, తమకు ఇంకా అవకాశాలు ఉన్నాయని ఆయన ధీమా వ్యక్తం చేశారు. గెలవాలంటే ఆరంభం నుండి చివరి వరకు ఆధిపత్యం ప్రదర్శించాల్సిన అవసరం ఉందని అన్నారు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola