మరి కొద్ది రోజుల్లో భారత్‌తో టెస్టు సిరీస్.. కీలక ప్లేయర్ దూరం

ఆసియా కప్‌ లో టైటిల్ ను సొంతం చేసుకున్న భారత్... ఇప్పుడు నెక్స్ట్ సిరీస్ కు రెడీ అవుతుంది. భారత్ తో వెస్టిండీస్ టెస్టు సిరీస్ ఆడనున్నారు. అక్టోబర్ 2వ తేదీ నుంచి రెండు టీమ్స్ మధ్య మ్యాచ్ మొదలు కానుంది. టోర్నీ కోసం ఇప్పటికే భారత్‌ చేరుకున్న వెస్టిండీస్ టీమ్ కు ఊహించని షాక్ తగిలింది. బౌలర్‌ అల్జారీ జోసెఫ్ బ్యాక్ ఇంజ్యూరీ వల్ల టోర్నీ నుంచి తప్పుకున్నారు. రెండు టెస్టులకూ దూరమయ్యాడు. అల్జారీ స్థానాన్ని మరో పేసర్ జెడియా బ్లేడ్స్‌ ఆడనున్నారు. కానీ జెడియాకు టెస్టు ఆడిన అనుభవం లేదు. దాంతో ఇదే విషయంపై వెస్టిండీస్ టీమ్ లో కాస్త కలవరపాటుకు మొదలయింది. మరో పేసర్ షమర్ జోసెఫ్ గాయం కారణంగా టీమ్ కు దూరం కావడంతో అతని స్థానంలో ఆల్ రౌండర్ జోహన్ లేన్‌ను తీసుకుంది. ఇక అక్టోబర్ 2వ తేదీ నుంచి 6వ తేదీ మధ్య అహ్మదబాద్‌లో తొలి టెస్టు జరగనుంది. అక్టోబర్ 10వ తేదీ నుంచి 14వ తేదీ మధ్య ఢిల్లీ వేదికగా రెండో టెస్టు జరగబోతుంది. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola