karun Nair in Ranji Trophy | 174 పరుగులు చేసిన కరుణ్ నాయర్
సీనియర్ బ్యాటర్ కరుణ్ నాయర్ ప్రస్తుతం జరుగుతన్న రంజీ మ్యాచ్ లో చెలరేగిపోతున్నాడు. కర్ణాటక తరపున ఈ సీజన్ లో అద్భుతమైన ప్రదర్శనతో సెలెక్టర్లకు గట్టి సమాధానం ఇస్తున్నాడు. గోవాతో జరిగిన మ్యాచ్‌లో కరుణ్ నాయర్ 174 పరుగులతో నాటౌట్‌గా నిలిచాడు.
అయితే రీసెంట్ గా జరిగిన ఒక ప్రెస్ కాన్ఫరెన్స్ లో చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ కరుణ్ నాయర్ గురించి మాట్లాడుతూ... కరుణ్ నాయర్ నుంచి ఇంకా ఎక్కువ ఆశించాము. ఒక్క ఇన్నింగ్స్ గురించి మాత్రమే ఇది కాదని అన్నారు. అజిత్ అగార్కర్ కామెంట్స్ కు కరుణ్ నాయర్ తన బ్యాట్ తోనే సమాధానం చెప్పాడు. 174 నాటౌట్ ఇన్నింగ్స్‌తో 25వ సెంచరీని పూర్తి చేసుకున్నాడు.
టెస్టుల్లో ట్రిపుల్ సెంచరీ చేసిన కరుణ్ నాయర్.. ఇంగ్లాండ్ సిరీస్ లో అంతగా పెర్ఫర్మ్ చేయలేక పొయ్యాడు. వెస్టిండీస్ సిరీస్, సౌతాఫ్రికా ‘ఏ’ సిరీస్ లో కూడా అతని తీసుకోలేదు. కానీ దేశవాళీ క్రికెట్‌లో అద్భుతంగా రాణిస్తున్నాడు. టీమ్ లోకి తాను రావాలనుకుంటున్నట్టు తన బ్యాటింగ్ తోనే సెలెక్టర్స్ కు కరుణ్ నాయర్ హింట్ ఇస్తున్నాడు.