Kaif Advises Kuldeep Yadav To Retire | కుల్దీప్‌ను రిటైర్ అవ్వమన్న కైఫ్

Continues below advertisement

ఇంగ్లాండ్‌తో జరిగిన మూడో వన్డేలో భారత్ ఓటమితో పాటు తుది జట్టు ఎంపిక ఇప్పుడు పెద్ద వివాదంగా మారింది. స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా, ఆల్‌రౌండర్ వాషింగ్టన్ సుందర్ గాయాల వల్ల దూరమైనప్పటికీ సీనియర్ స్పిన్నర్ కుల్దీప్ యాదవ్‌కు తుది జట్టులో చోటు దక్కకపోవడం అందరినీ ఆశ్చర్యపరిచింది.

ఈ నిర్ణయంపై భారత మాజీ క్రికెటర్ రవిచంద్రన్ అశ్విన్ తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేశారు. కుల్దీప్‌ను ఇలా పక్కన పెట్టడం అతని కాన్ఫిడెన్స్, ఫామ్‌ను దెబ్బతీస్తుందని హెచ్చరించారు. మరోవైపు మాజీ క్రికెటర్ మహమ్మద్ కైఫ్ ఏకంగా సంచలన వ్యాఖ్యలు చేశారు.

 "118 వన్డేల్లో 194 వికెట్లు తీసిన రికార్డు ఉన్నా కుల్దీప్‌ను పక్కన పెట్టడం దారుణం. బుమ్రా, సుందర్ లేకపోయినా అవకాశం ఇవ్వనప్పుడు.. కుల్దీప్ ఇక అంతర్జాతీయ క్రికెట్ నుంచి రిటైర్మెంట్ గురించి ఆలోచించడమే మేలు" అని కైఫ్ అన్నారు. లార్డ్స్ పిచ్‌పై లెఫ్ట్ ఆర్మ్ రిస్ట్ స్పిన్నర్ ఉండి ఉంటే బౌలింగ్‌లో డిఫరెన్స్ ఉండేదని, కానీ అనుభవం లేని పేస్ విభాగాన్ని దించడంతో భారత్ భారీ మూల్యం చెల్లించుకుందని ఆయన అభిప్రాయపడ్డారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola