Jadeja Record in India vs England Test | 73 ఏళ్ల తర్వాత రికార్డు సృష్టించిన జడేజా

ఇంగ్లండ్‌ వేదికగా లార్డ్స్‌ లో జరిగిన ఉత్కంఠ భరితమైన మూడో టెస్టు మ్యాచ్ లో టీం ఇండియా ఓటమిపాలైంది. 22 పరుగుల తేడాతో భారత్‌పై ఇంగ్లండ్‌ విజయం సాధించింది. జడేజా అద్భుతమైన బ్యాటింగ్‌తో ఆకట్టుకున్నాడు. వారియర్ లాగా టీంను గెలిపించడానికి చాలానే కష్టపడ్డాడు. జడేజాతో కలిసి బ్యాట్టింగ్ చేసిన సిరాజ్‌ శ్రమ కూడా వృథా అయ్యింది. 74.5 ఓవర్‌లో షోయబ్‌ బషీర్‌ బౌలింగ్‌లో సిరాజ్‌ అవుట్‌ అవడంతో టీమిండియా పోరాటం ముగిసింది. 

అయితే ఈ మ్యాచ్ లో ఆల్​రౌండర్ రవీంద్ర జడేజా కొత్త రికార్డు సృష్టించాడు. నాలుగో ఇన్నింగ్స్‌లో జడేజా హాఫ్ సెంచరీ చేసాడు. తొలి ఇన్నింగ్స్‌లో 72 రన్స్ చేసిన అతను రెండో ఇన్నింగ్స్‌లో 61 పరుగులు చేశాడు. దాంతో జడేజా ఒక అరుదైన రికార్డును సమం చేశాడు. లార్డ్స్ లో ఒకే టెస్టు మ్యాచ్‌లో రెండు ఇన్నింగ్స్‌ల్లోనూ 50 కంటే ఎక్కువ రన్స్ స్కోరు చేసిన రెండో బ్యాటర్ జడేజా మాత్రమే. 1952లో వినో మన్కడ్ రెండు ఇన్నింగ్స్‌ల్లో వరుసగా 72, 184 రన్స్ చేశాడు. 73 ఏళ్ల తర్వాత జడేజా మళ్లీ ఈ రికార్డు ను సమం చేసాడు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola