Jadeja All-Round Show vs RR IPL 2026 | భార్యకు అవార్డు అంకితం చేసిన జడేజా

వరుస పరాజయాలకు చెక్ పెడుతూ లక్నో సూపర్ జెయింట్స్‌పై 40 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది రాజస్థాన్ రాయల్స్. ఈ  విజయంలో ఆల్‌రౌండ్ షోతో అదరగొట్టిన రవీంద్ర జడేజా మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డును గెలుచుకున్నాడు.

మ్యాచ్ తర్వాత జడేజా ఆసక్తికర విషయాన్ని పంచుకున్నాడు. తన పెర్ఫార్మన్స్ ని తన భార్య, గుజరాత్ విద్యాశాఖ మంత్రి రివాబా జడేజాకు అంకితం ఇస్తున్నట్లు ప్రకటించాడు. "రేపటి మ్యాచ్‌లో నువ్వు అద్భుతాలు చేస్తావని ఆమె నాతో చెప్పారు. ఆమె నమ్మకం నిజమైంది, అందుకే ఈ అవార్డు ఆమెకే" అంటూ జడేజా భావోద్వేగానికి లోనయ్యాడు.

లక్నో హిట్టర్ నికోలస్ పూరన్ వికెట్ తీసిన తర్వాత జడేజా చేసిన సెలబ్రేషన్ వైరల్‌గా మారింది. దీనిపై స్పందిస్తూ.. "పూరన్ నా జేబులో ఉన్నాడు. ఆ వికెట్ పడగానే అప్పటికప్పుడు అలా సెలబ్రేట్ చేయాలనిపించింది. వికెట్ గ్రిప్ అవ్వడంతో పేస్‌ను మారుస్తూ స్లో బాల్స్ వేయడం వల్ల పూరన్ బోల్తా పడ్డాడు" అని జడేజా తన బౌలింగ్ సీక్రెట్‌ను బయటపెట్టాడు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola