Ishan Kishan 270 In Duleep Trophy Final | డబుల్ సెంచరీ వెనుక రహస్యాన్ని చెప్పిన ఇషాన్ కిషన్

Continues below advertisement

దులీప్ ట్రోఫీ ఫైనల్లో సౌత్ జోన్‌పై 270 పరుగుల సంచలన డబుల్ సెంచరీతో విరుచుకుపడిన ఈస్ట్ జోన్ కెప్టెన్ ఇషాన్ కిషన్, తన అద్భుతమైన ఇన్నింగ్స్ వెనుక ఉన్న రహస్యాన్ని వెల్లడించాడు. కెరీర్‌లో కష్ట కాలాన్ని ఎదుర్కొన్న తర్వాత ఆలోచనలు, అంచనాలను పక్కన పెట్టి పూర్తిగా బ్యాటింగ్‌పైనే దృష్టి సారించినట్లు పేర్కొన్నాడు.

తనలో మార్పు సహజంగానే వచ్చిందని తెలిపాడు. భారత జట్టుకు దూరమైనప్పుడు, అనవసర ఆలోచనలతో ఒత్తిడి పెంచుకోకుండా క్రీజులోకి వెళ్లి పరుగులు చేయడం పైనే శ్రద్ధ పెట్టాలని గ్రహించినట్లు చెప్పాడు. 2023లో టీమిండియా తరఫున మెరిసినా, కొన్ని ఊహించని పరిణామాల వల్ల బీసీసీఐ సెంట్రల్ కాంట్రాక్ట్‌ను కోల్పోయిన కిషన్.. నిరాశ చెందకుండా దేశవాళీ క్రికెట్‌లో కష్ట పడ్డాడు. 

ప్రస్తుతం ఏమీ ఆలోచించకుండా బాల్ చూసి ఆడటం పైనే ఫోకస్ పెడుతున్నానని ఇషాన్ స్పష్టం చేశాడు. ఫైనల్ వ్యూహాల గురించి మాట్లాడుతూ, సీవోఈలో రెడ్ బాల్‌తో ప్రత్యేక ప్రాక్టీస్ చేశానని తెలిపాడు. టీ20లు ఎక్కువగా ఆడినప్పుడు అనవసర షాట్లకు పోయి వికెట్ పారేసుకునే అవకాశం ఉంటుందని, అందుకే ఫైనల్లో చిన్న చిన్న భాగస్వామ్యాలు నిర్మిస్తూ వికెట్ కాపాడుకోవడమే లక్ష్యంగా పెట్టుకున్నానని వివరించాడు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola