Irfan Pathan Comments on Shubman Gill | గిల్‌కు కీలక సూచన చేసిన ఇర్ఫాన్ పఠాన్‌

Continues below advertisement

భారత్, సౌతాఫ్రికా మధ్య టీ20 సిరీస్‌ ప్రారంభం కానుంది. టెస్ట్ సిరీస్ లో వైట్ వాష్ కు గురైన టీమ్ ఇండియా.. వన్డే సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకుంది. అయితే ఇప్పుడు టీ20 లో కూడా అదే ఫార్మ్ ను కొనసాగించి...  సిరీస్ ను కైవసం చేసుకోవాలని చూస్తుంది. మరోపక్క సఫారీలు వన్డే సిరీస్ ఓడిపొయ్యారు కాబట్టి టీ20 సిరీస్ ను టార్గెట్ చేసారు. దాంతో ఈ సిరీస్ రెండు టీమ్స్ కు చాలా కీలకంగా మారింది. ఇక మెడనొప్పితో దక్షిణాఫ్రికాతో రెండో టెస్టు, వన్డే సిరీస్‌కు దూరమైన శుభ్‌మన్ గిల్.. టీ20 సిరీస్‌ ఆడనున్నాడు. హార్దిక్ పాండ్యా కూడా ఈ సిరీస్‌తో రీఎంట్రీ ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో టీ20 సిరీస్‌కు ముందు టీమిండియా మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ భారత వన్డే కెప్టెన్ శుభ్‌మన్ గిల్‌కు కీలక సూచన చేశాడు.

టీ20 ప్రపంచకప్ 2026 ముందు టీమ్ లో స్థానంలో సంపాదించాలంటే ఈ సిరీస్‌లో తప్పకుండా రాణించాలని పఠాన్ సూచించాడు. లేకపోతే.. జట్టులో చోటు కష్టమని గిల్ కు హెచ్చరించాడు.

“వన్డే, టెస్ట్ కెప్టెన్ శుభ్‌మన్ గిల్ టీ20 ఫార్మాట్‌లో తన స్థానాన్ని పదిలం చేసుకోవాల్సిన అవసరం ఉంది. అతడు మూడు ఫార్మాట్లు ఆడే సత్తా ఉన్న ఆటగాడు. టీ20ల్లో అతడి సామర్థ్యం ఏంటో ఐపీఎల్‌లో మనమంతా చూశాం. తనను తాను నిరూపించుకునేందుకు సౌతాఫ్రికాతో 5 మ్యాచ్‌ల టీ20 సిరీస్‌ గిల్‌కు మంచి ఛాన్స్. అయితే శుభ్‌మన్‌పై కొంత ఒత్తిడి ఉంటుంది. కానీ అతడు దాన్ని అధిగమించగలడు. ఈ సిరీస్‌లో అతడు రాణిస్తాడని ఆశిస్తున్నా” అని ఇర్ఫాన్ పఠాన్ సూచించాడు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola