Yashasvi Jaiswal 559 Runs IPL 2025 | రాజస్థాన్ తురుపుముక్క...సూపర్ ఫామ్ తో లీగ్ ను ముగించిన జైశ్వాల్

 ఈసారి ఐపీఎల్ ను రాజస్థాన్ రాయల్స్ ప్రస్తుతానికి తొమ్మిదో స్థానంతో ముగించి ఉండొచ్చు కానీ ఈసారి RR సానుకూలతలు బాగానే ఉన్నాయి. మొదటిది వైభవ్ సూర్యవంశీ లాంటి చిచ్చరపిడుగును, సంచలనాన్ని ఫైండ్ అవుట్ చేసి అవకాశం ఇవ్వటం అయితే రెండోది యశస్వి జైశ్వాల్ సూపర్ ఫామ్ ను చూపించటం. లీగ్ అంతా రాజస్థాన్ గెలిచినా గెలవకున్నా యశస్వి జైశ్వాల్ మాత్రం ఆడుతూనే ఉన్నాడు. హాఫ్ సెంచరీల మీద హాఫ్ సెంచరీలు బాదుకుంటూ రాజస్థాన్ కు మూలస్తంభంలా నిలిచాడు. నిన్న చెన్నై మీద మ్యాచ్ కూడా 19 బంతుల్లోనే 5ఫోర్లు 2 సిక్సర్లతో 36పరుగులు చేసిన యశస్వి...వైభవ్ సూర్యవంశీ తో కలిసి ఆఖరి 7మ్యాచుల్లో పరుగుల వరద పారించాడు. మొత్తంగా ఈ సీజన్ లో 14 మ్యాచులు ఆడి 159 స్ట్రైక్ రేట్ తో 559 పరుగులు చేశాడు. ఇందులో 6 హాఫ్ సెంచరీలు ఉన్నాయి. యశస్వి 2023 సీజన్ లో 625పరుగులు చేసిన తర్వాత ఇదే అతని కెరీర్ లో రెండో అత్యధిక సీజన్ స్కోరు. ఈ సీజన్ లో మొత్తం 28 సిక్సర్లు బాదాడు జైశ్వాల్. సాయి సుదర్శన్, గిల్, సూర్యకుమార్ యాదవ్, విరాట్ కొహ్లీ సహా  టాప్ ్5లో ఉన్న మరే ఆరెంజ్ క్యాప్ పోటీదారుడు కూడా అన్ని సిక్సర్లు బాదలేదు. ఆరేళ్లుగా రాజస్థాన్ కే ఆడుతూ ఈ ఏడాది లీగ్ కోసం 18కోట్ల రూపాయలు యశస్వి జైశ్వాల్ మీద పెట్టిన RR నమ్మకాన్ని నిలబెడుతూ సీజన్ లో మంచి ప్రదర్శన చేశాడు యశస్వి జైశ్వాల్. ప్రస్తుతం టేబుల్ లో ఈ సీజన్ లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో మూడో స్థానంలో ఉన్న జైశ్వాల్...తన వెనుకనే ఉన్న సూర్య కుమార్, విరాట్ కొహ్లీ, జోస్ బట్లర్ లకు జైశ్వాల్ ను దాటే ఛాన్స్ అయితే కనిపిస్తోంది కానీ దాటినా ఈ సీజన్ ను టాప్ 5 బ్యాటర్ గా ముగించే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి యశస్వి జైశ్వాల్ కు.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola