Virat Kohli Sympathy Drama IPL 2025 | కొహ్లీ కావాలనే సింపతీ డ్రామాలు ఆడాడా
కింగ్ విరాట్ కొహ్లీ సింపతీ డ్రామాలు ఆడాడా. మ్యాచ్ ఓడిపోతున్నామని తిడతారని అది బయటకు రాకుండా వేలికి గాయమైనట్లు నటించాడా. కొహ్లీ యాంటీ ఫ్యాన్స్ వైరల్ చేస్తున్న ఈ పోస్టుల్లో ఏముంది. ఇన్నింగ్స్ 12 ఓవర్ లో కృనాల్ పాండ్యా బౌలింగ్ చేస్తున్నాడు. పాండ్యా వేసిన ఐదో బంతిని సాయిసుదర్శన్ కొట్టగా అది బౌండరీ రోప్స్ వరకూ వెళ్లిపోయింది. అయితే వేగంగా వచ్చి బంతిని ఆపే ప్రయత్నం చేసినా విరాట్ కొహ్లీ చేతి వేలికి బంతి తగిలి బౌండరీలోకి వెళ్లిపోయింది. కొన్ని క్షణాల్లో జరిగిన ఆ ఘటన కొహ్లీ కి ఏం అర్థం కాలేదు. పైగా చేతి వేలిని పట్టుకుని విలవిలలాడిపోయారు. మెడికల్ టీమ్ వచ్చి ఎగ్జామిన్ చేసి కొహ్లీకి కావాల్సినవి అందించారు. అయితే కొహ్లీ బంతిని వదిలిపెట్టేసి అంత ఈజీ ఫీల్డింగ్ చేయలకేపోయినందుకు ఫ్యాన్స్ అడిగే ప్రశ్నలు వినలేక చేతులు విలవిలలాడినట్లు నటించాడని….అది కేవలం హ్యూమిలియేషన్ కి గురి కాకుండా సింపతీ గేమ్ కొహ్లీ ప్లే చేశాడంటూ కొంత మంది కొహ్లీ ఫోటోలను వైరల్ చేస్తున్నారు. ఏదో ఆటగాడివే అనుకుంటే ఆస్కార్ ఆర్టిస్ట్ లా జీవించేస్తున్నావంటూ పాపం కొహ్లీ పై ట్రోల్స్ తో దాడి చేస్తున్నారు యాంటీ ఫ్యాన్స్.