Travis Head IPL 2024 Final | KKR vs SRH ఫైనల్లో ఓపెనర్ హెడ్ పైనే అందరి దృష్టి | ABP Desam
Download ABP Live App and Watch All Latest Videos
View In Appటీమిండియా 2023లో రెండు భారీ టోర్నీలు జస్ట్ ఫైనల్లో ఓడిపోయింది. ఒకటి వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ ఫైనల్. లార్డ్స్ లో ఆస్ట్రేలియాతో జరిగిన ఈ ఫైనల్ టెస్ట్ మ్యాచ్ లో భారత్ పాలిట కొరకరాని కొయ్యగా మారి ఆసీస్ ను గెలిపించింది ట్రావియెస్ హెడ్. ఫస్ట్ ఇన్నింగ్స్ లో హెడ్ బాదిన 163పరుగులు ఆసీస్ కు ఊహించని స్థాయిలో ఆధిక్యం ఇవ్వటంతో పాటు..భారత్ ను ఓడించి ఆస్ట్రేలియానే వరల్డ్ టెస్ట్ ఛాంపియన్ షిప్ గెలుచుకోవటంలో కీలకపాత్ర పోషించాడు. మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ గానూ నిలిచాడు. తిరిగి నవంబర్ లో వన్డే వరల్డ్ కప్. మళ్లీ ఫైనల్లో భారత్ కు ఎదురుపడింది ఆస్ట్రేలియా. చచ్చీ చెడీ భారత్ 240పరుగులు చేస్తే..మళ్లీ హెడ్డే మనకు హెడేక్ తెప్పించాడు. ఓపెనర్ గా వచ్చి వరల్డ్ కప్ ఫైనల్లో 137పరుగులు చేయటంతో ఆస్ట్రేలియా ఆరువికెట్ల తేడాతో ఘన విజయం సాధించి వరల్డ్ కప్ మన చేతుల్లో నుంచి లాక్కెళ్లిపోయింది. మళ్లీ మ్యాన్ ఆఫ్ ది మ్యాచే ట్రావియెస్ హెడ్డే. ఇప్పుడు అలాంటోడు మూడోసారి భారీ టోర్నీలో ఫైనల్ ఆడుతున్నాడు.