Tilak Varma Batting vs RCB IPL 2025 | తనను అవమానించిన హార్దిక్ తో కలిసే దడదడలాడించిన తిలక్

 గత మ్యాచ్ లో LSG మీద స్లో బ్యాటింగ్ చేశాడని బలవంతంగా తనను హార్దిక్ పాండ్యా రిటైర్డ్ అవుట్ చేయించటాన్ని మనసులో పెట్టుకున్నాడేమో ముంబై యంగ్ స్టర్ తిలక్ వర్మ ఆర్సీబీ మీద మ్యాచ్ లో మాత్రం చెలరేగిపోయాడు. 222 పరుగుల టార్గెట్ ను ఛేజ్ చేసే క్రమంలో టాప్ ఆర్డర్ విఫలమైనా ఆ ప్రెజర్ తను తీసుకోకుండా ఆర్సీబీ బౌలర్ల దుమ్ము రేపాడు తిలక్ వర్మ.
ఏ బ్యాటర్ నైతే లాస్ట్ మ్యాచ్ లో స్లోగా ఆడాడు అని బలవంతంగా రిటైర్డ్ అవుట్ చేయించారో అదే బ్యాటర్ ఆర్సీబీ పెట్టిన భారీ స్కోరును ఛేజ్ చేసేంత దూకుడుగా ముంబై స్కోరు బోర్డును తీసుకువెళ్లాడు. రోహిత్ శర్మ, ర్యాన్ రికెల్టెన్, విల్ జాక్స్, సూర్య కుమార్ యాదవ్ అందరూ దారుణంగా ఫెయిల్ అవ్వకపోయినా ఎవ్వరూ 30పరుగుల స్కోరు కూడా చేయలేదు. కానీ కెప్టెన్ హార్దిక్ పాండ్యా తో కలిసి దుమ్ము రేపాడు తిలక్ వర్మ. 29 బాల్స్ మాత్రమే ఆడి 4 ఫోర్లు 4 సిక్సర్లతో 56 పరుగులు చేశాడు తిలక్ వర్మ. ముంబై తరపున టాప్ స్కోరర్ గా నిలిచాడు. భువీ బౌలింగ్ లో ఫిల్ సాల్ట్ మంచి క్యాచ్ పట్టడంతో అవుటైపోయాడు కానీ లేదంటే ఒక్కడే ఉండి మ్యాచ్ ఫినిష్ చేసినా ఆశ్చర్యపోవాల్సింది ఏమీ లేదు. అంత టచ్ లో కనిపించాడు తిలక్ వర్మ...స్లో బ్యాటింగ్ అనే మాటే వినపడకుండా ఏకంగా 193 స్ట్రైక్ రేట్ బ్యాటింగ్ చేసి తన పవర్ ఏంటో తన సత్తా ఏంటో చాటిచెప్పాడు తిలక్ వర్మ. మ్యాచ్ ఓడిపోయినా సరే తిలక్ డేరింగ్ అండ్ డ్యాషింగ్ బ్యాటింగ్ కి మాత్రం మంచి అఫ్లాజ్ వచ్చింది

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola