Sunrisers Failure Reasons IPL 2025 | సన్ రైజర్స్ కి ఈ సీజన్ లో కొంప ముంచిది ఇవే
ఈ సీజన్ లో సన్ రైజర్స్ నుంచి ఇలాంటి ఘోరమైన ప్రదర్శనను ఎవరూ ఎక్స్ పెక్ట్ చేసి కూడా ఉండరు రీజన్ రెండేళ్లుగా ఆరెంజ్ ఆర్మీ సెట్ అయిన విధానం. ట్రావియెస్ హెడ్, అభిషేక్ శర్మ ఓపెనింగ్ కాంబినేషన్...క్లాసెన్, నితీశ్ కుమార్ రెడ్డి లాంటి విధ్వంసకర ఆటగాళ్లు..జట్టును సమతూకం చేస్తూ బౌలింగ్ లో ప్రత్యర్థుల నోళ్లు మూయించే సైలెన్సర్ ప్యాట్ కమిన్స్...మొత్తంగా సన్ రైజర్స్ జట్టంటేనే ప్రత్యర్థులు భయపడేలా రెండేళ్లుగా వాళ్ల ప్రదర్శనలు ఉన్నాయి. నిరుడు ఇదే జట్టుతో ఫైనల్ దాకా వెళ్లిన సన్ రైజర్స్..ఈ సారి మాత్రం ఊహించని పరాజయాలతో డీలా పడిపోయింది. లాస్టే ఇయరే బ్యాటింగ్ రికార్డుల ఊచకోత కోసిన సన్ రైజర్స్ ఆటగాళ్లు..ఈ సీజన్ ను ఆరంభించటమే ఐపీఎల్ చరిత్రలో రెండో అత్యధిక 286పరుగులు కొట్టి ప్రారంభించారు. ఈసారి ఇషాన్ కిషన్ తోడవటం తో టీమ్ మరింత దుర్భేధ్యంగా తయారైంది. 300 రికార్డులను బద్ధుల కొట్టేయటం ఖాయం అనే ధీమా అందరిలోనూ కనిపించింది. 300 సంగతి పక్కన పెడితే కనీసం మ్యాచ్ లు కూడా గెలవలేదు సన్ రైజర్స్. 11 మ్యాచ్ లు ఆడితే 3 గెలిచింది..ఒకటి ఫలితం లేదు. 7 మ్యాచుల్లో ఓటమి చవి చూసింది సన్ రైజర్స్. కాటేరమ్మ కొడుకులు అనే ఎలివేషన్స్...జట్టు కంటే ఆటగాళ్ల మీద వాళ్ల వ్యక్తిగత ప్రదర్శనల మీద..రికార్డులను బద్దలు కొట్టాలనే లక్ష్యాల మీద దృష్టి పెట్టడంతో అసలు టీమ్ స్పిరిట్ పక్కకు వెళ్లిపోయింది. ప్రాక్టీస్ కంటే పార్టీ కల్చర్ కూడా సన్ రైజర్స్ ను డేమేజ్ చేస్తుందని చెబుతున్నారు ఇన్ సైడర్స్. ఇంతటి క్రూషియల్ స్టేజ్ లో మ్యాచ్ లు వరుసగా ఓడిపోతుంటే లీగ్ మధ్యలో మాల్దీవులు వెళ్లి నాలుగు రోజులు ఎంజాయ్ చేసి వచ్చారు సన్ రైజర్స్ ఆటగాళ్లు. ప్రెజర్ నుంచి రిలీఫ్ అవ్వటానికి ఇలాంటి బ్రేక్ లు మంచిదే అయినా ప్రాక్టీస్ ను వదిలేసి ఎన్ని పార్టీలు చేసుకుంటే మాత్రం మ్యాచ్ లు గెలుస్తామా అనేది బేసిక్ క్వశ్చన్. లోపాలు సరిదిద్దుకుని వచ్చే ఏడాదికైనా సన్ రైజర్స్ గ్రేట్ కమ్ బ్యాక్ ఇవ్వాలని...కావ్యాపాప మొహంలో నవ్వు చూడాలని సగటు ఆరెంజ్ ఆర్మీ అభిమాని కోరుకుంటున్నాడు.