SRH vs PBKS Match Preview | టాప్-2పై కన్నేసిన SRH...RR ఓడిపోతే హైదరాబాద్ ఫ్యాన్స్ కు పండగే | ABP

Continues below advertisement

SRH vs PBKS Match Preview | హమ్మయ్యా..! ఇంకో మ్యాచ్ ఉండగానే SRH క్వాలిఫైయర్స్ లో అడుగుపెట్టింది అనుకుంటున్నారా కానీ, ఇది కాదు మన అసలు టార్గెట్. మన టార్గెట్ టాప్ -2లో ఉండటం. ఒక్కసారి పాయింట్స్ టేబుల్ చూడండి..! 19 పాయింట్లతో కోల్ కతా నైట్ రైడర్స్..14 పాయింట్లతో ఆర్సీబీ ఫస్ట్ అండ్ 4th పోజిషన్స్ లో ఫిక్స్ అయ్యాయి. రాజస్థాన్ 16 పాయింట్లతో.. సన్ రైజర్స్ హైదరాబాద్ 15 పాయింట్లతో 2వ ప్లేస్ నువ్వా నేనా అన్నట్లుగా ఉన్నాయి. ఈ రోజు మధ్యాహ్నం పంజాబ్ కింగ్స్ తో సన్ రైజర్స్ హైదరాబాద్ లీగ్ లో చివరి మ్యాచ్ ఆడబోతుంది. ఈ మ్యాచ్ లో మనం గెలిస్తే 17 పాయింట్స్ తో SRH 2వ ప్లేస్ లోకి వెళ్తుంది. ఇక..రాత్రి కేకేఆర్ వెర్సస్ రాజస్థాన్ మ్యాచులో రాజస్థాన్ ఓడిపోయింది అనుకోండి ఆ టీమ్ సేమ్ 16 పాయింట్లతో 3 వ ప్లేస్ లోకి ఉంటుంది. దీని వల్ల SRHకు ఓ పెద్ద అడ్వాంటేజ్ ఉంది. అదేంటంటే..! పాయింట్స్ టేబుల్ లో ఫస్ట్ అండ్ సెకండ్ ప్లేస్ లో ఉన్న టీమ్స్ మధ్య క్వాలిఫైయర్ 1 జరుగుతుంది. ఇందులో గెలిచిన వాళ్లు నేరుగా ఫైనల్ కి వెళ్తారు. ఓడిపోయిన టీమ్ ఇంటికి పోదు. దానికి ఇంకో ఛాన్స్ ఉంటుంది.  పాయింట్స్ టేబుల్ లో 3,4వ ప్లేస్ లో ఉన్న టీమ్స్ మధ్య ఎలిమినేటర్స్ మ్యాచ్ జరుగుతుంది. ఇందులో గెలిచిన వాళ్లు నేరుగా ఫైనల్ గా వెళ్లరు. క్వాలిఫైయర్స్ 1లో ఓడిపోయిన టీమ్ తో ఇంకో మ్యాచ్ ఆడాలి. అదే క్వాలిఫైయర్స్ -2. ఆ మ్యాచులో కూడా గెలిస్తేనే ఫైనల్ కు వెళ్లడానికి అవకాశం ఉంటుంది. ఈ లెక్కన చూస్తే.. 3,4 ప్లేస్ లో ఉన్న టీమ్స్ ఎలిమినేటర్స్ , క్వాలిఫైయర్స్ , ఫైనల్ ఇలా మూడు మ్యాచుల్లో కచ్చితంగా గెలిస్తే కప్ వస్తుంది. అదే..టాప్ 1,2 ప్లేస్ లలో ఉన్న టీమ్స్ కు క్వాలిఫైయర్స్ 1, క్వాలిఫైయర్స్ 2, ఫైనల్ ఇలా.. ఏ రెండింట్లో గెలిచినా కప్ వస్తుంది. అంటే ఒక మ్యాచ్ ఎక్కువగా ఆడే అవకాశం వస్తుంది. కాబట్టి...SRH టాప్ -2లో ఉంటే కప్ గెలవడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. కాబట్టి.. ఈరోజు మధ్యాహ్నం SRH గెలవాలని... రాత్రి RR ఓడిపోవాలని హైదరాబాద్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు. 
c

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram