SRH vs LSG Match Preview IPL 2025 | నేడు సన్ రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్ మ్యాచ్ | ABP

Continues below advertisement

  ఈరోజు ముహూర్తం ఖరారైపోయింది. పంతులు గారు చెప్పేశారు. ఆ 300 రికార్డుకు దండేయటం ఖాయం. కాటేరమ్మో వస్తదో..ఆమె కొడుకులనే పంపిస్తదో తెలియదు కానీ LSG అనే చిరకాల మిత్ర శత్రువు దొరికింది ఈ రోజు సన్ రైజర్స్ చేతికి. ఎవరికి తక్కువ అంచనా వేయటమో తక్కువ చేసి మాట్లాడమో కాదు కానీ సన్ రైజర్స్ ఉన్న ఫామ్ కి..ఆ ఆటగాళ్లు చూపిస్తున్న బ్రూటాలిటికీ ప్రస్తుతం వాళ్లకు ఎదురే లేదు. వాళ్లను 200లోపు కట్టడి చేస్తే చాలు అప్పోనెంట్ టీమ్ కి అదే పదివేలు. హెడ్, అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్, హెన్రిచ్ క్లాసెన్, నితీశ్ కుమార్ రెడ్డి ఇలా ఒకడి తర్వాత ఒకడు వచ్చే ప్రతీవాడు 200 పైగా స్ట్రైక్ రేట్ తో ఉప్పల్ ని తగలబెట్టేస్తుంటే ఏ రికార్డులు మాత్రం ఎంత కాలమని బతుకుతాయి. ఐపీఎల్ చరిత్రలో టాప్ 3 హయ్యెస్ట్ టీమ్ స్కోర్స్ తమ పేరిటే రాసుకున్న సన్ రైజర్స్ కి ఈరోజు లక్నో సూపర్ జెయింట్స్ ఢీకొడుతోంది. లాస్ట్ టైమ్ లక్నో సక్సెస్ అయ్యిందనే చెప్పాలి. ఎందుకంటే ఫస్ట్ బ్యాటింగ్ వాళ్లు చేశారు కాబట్టి సన్ రైజర్స్ 200 కొట్టకుండా అడ్డుకోగలిగింది లక్నో సూపర్ జెయింట్స్. వాళ్లు గతేడాది విసిరిన 164 పరుగుల లక్ష్యాన్ని చచ్చీచెడీ ఒక్క వికెట్ కూడా కోల్పోకుండా 9.4 ఓవర్లలో ఛేజ్ చేసింది సన్ రైజర్స్ హైదరాబాద్. మొన్న వైజాగ్ లో ఢిల్లీ మీద అద్భుతంగా ఆడదామనుకుని భారీ స్కోర్ చేసి తర్వాత అశుతోష్ శర్మ సర్వం అర్పించుకుని ఓడిపోయారు కాబట్టి ఈరోజు సన్ రైజర్స్ ను లక్నో ఆటగాళ్లు కసితో ఢీకొడతారో లేదా  బలంగా కుమ్మించుకుని 300 పరుగుల రికార్డును ఆరెంజ్ ఆర్మీ మెడలో వేసి వెళ్లిపోతారో చూడాలి.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram