Shreyas Iyer Creates Record in IPL History | ధోనీ, రోహిత్ లకు సాధ్యం కాని విధంగా అయ్యర్ కెప్టెన్సీ

 ఐపీఎల్ చరిత్రలో తమ జట్లకు ఐదేసి కప్పులు అందించిన కెప్టెన్లు ఉన్నారు. ధోని చెన్నైకి, రోహిత్ ముంబైకి ఐదేసి కప్పులు అందించారు. కానీ వీరిద్దరికీ కూడా సాధ్యం కాని ఓ రికార్డును శ్రేయస్ అయ్యర్ కెప్టెన్ గా సెట్ చేశాడు. అదే మూడు టీమ్స్ ను ఐపీఎల్ ఫైనల్ కి తీసుకువెళ్లిన రికార్డు. ఎస్ 2019లో తొలిసారి ఢిల్లీ క్యాపిటల్స్ టీమ్ కు కెప్టెన్సీ చేసిన శ్రేయస్ అయ్యర్..ఏడు సీజన్ల తర్వాత తొలిసారి డీసీని ప్లే ఆఫ్స్ కి తీసుకువెళ్లాడు. ఆ మరుసటి సంవత్సరమే తన కెప్టెన్సీ పదును మరింతగా చూపిస్తూ 2020లో ఢిల్లీ క్యాపిటల్స్ ను ఏకంగా ఫైనల్ కి తీసుకువెళ్లాడు. అప్పటికి 13ఏళ్లలో ఢిల్లీ ఫైనల్ ఆడటం అదే మొదటిసారి. ఇప్పటికీ అదే రికార్డు డీసీకి. ఆ తర్వాత కెప్టెన్ గా కోల్ కతా నైట్ రైడర్స్ బాధ్యతలు అందుకున్న శ్రేయస్ అయ్యర్ గతేడాది కేకేఆర్ ను విజేతగా నిలిపాడు. పదేళ్ల తర్వాత కేకేఆర్ కప్పును ముద్దాడింది అంటే రీజన్ కెప్టెన్ శ్రేయస్ అయ్యర్. అయితే ఆ విలువ తెలియని కేకేఆర్ లో ఉండలేక ఆక్షన్ లోకి వచ్చేసిన అయ్యర్ ను తన విలువ తెలిసిన పంజాబ్ ఏకంగా 26కోట్ల 75లక్షల డబ్బు పెట్టి కొనుక్కుంది. తనకు పెట్టిన ప్రతీ రూపాయి కి వ్యాల్యూ ఇచ్చి అయ్యర్..కెప్టెన్ గా తన పంజాబ్ టీమ్ ను నిన్న ముంబైపై అద్భుత విజయం ద్వారా ఫైనల్ కి తీసుకువెళ్లాడు. 2014 తర్వాత పంజాబ్ ఆడుతున్న ఐపీఎల్ ఫైనల్ ఇదే. మరో వైపు బ్యాటర్ గానూ పంజాబ్ ను ముందుండి నడిపిస్తున్న అయ్యర్...ఈ సీజన్ లో ఏకంగా ఆరు హాఫ్ సెంచరీలతో 603 పరుగులు చేశాడు. పరుగుల వీరుల జాబితాలో కొహ్లీ ఐదో స్థానంలో ఉంటే..అయ్యర్ కొహ్లీ వెనుకాలే 6వ స్థానంలో ఉన్నాడు. అలా అటు బ్యాటర్ గానూ అద్భుతాలు చేస్తూ ఇటు కెప్టెన్ గానూ మూడు వేర్వేరు టీమ్స్ ను ఐదేళ్లలో ఫైనల్ కి పట్టుకెళ్లి కెప్టెన్ గా తన సత్తా ఏంటో ఘనంగా చాటాడు  శ్రేయస్ అయ్యర్.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola