Shivam Dube Batting vs RCB | RCB vs CSK Highlights| వరల్డ్ కప్ కు సెలెక్ట్ ఐతే... ఇక ఆడవా శివమ్..!
Shivam Dube Batting vs RCB | RCB vs CSK Highlights| చెన్నై ఈ సీజన్ లో 7 మ్యాచులు గెలవడానికి వన్ ఆఫ్ ది రిజన్ శివమ్ దూబే సూపర్ బ్యాటింగ్ కదా...! ఇది ఎంత నిజమే... నిన్న ఆర్సీబీ మ్యాచులో చెన్నై ప్లే ఆఫ్స్ కు వెళ్లకపోవడానికి కారణం కూడా అతడే. టీమ్ లోని మిగతా బ్యాటర్లంతా 150 ప్లస్ స్ట్రైక్ రేట్ తో బ్యాటింగ్ చేస్తే శివమ్ దూబే మాత్రం 15 బాల్స్ లో 7 పరుగులు మాత్రమే కొట్టాడు. అంటే స్ట్రైక్ రేట్ 46 యే. టార్గెట్ 200 ప్లస్ ఉన్న సందర్భంలో ఎవడైనా ఇలా బ్యాటింగ్ చేస్తాడా...! అది కూడా పవర్ హిట్టర్ అని పేరు పెట్టుకుని..! ఇక్కడే చెన్నై ఎక్కువగా నష్టపోయింది. ఈ మ్యాచ్ లోనే కాదు..గడిచిన లాస్ట్ 3 మ్యాచుల్లో చూసుకుంటే.. రాజస్థాన్ పై 11 బాల్స్ లో 18 పరుగులు ... పంజాబ్ పై ధర్మశాలలో డకౌట్..అదే పంజాబ్ పై చెన్నై చెపాక్ స్టేడియంలో డకౌట్ అయ్యాడు. టీ20 వరల్డ్ కప్ టీమ్ అనౌన్స్ మెంట్ కంటే ముందు పులిలా చెలరేగిపోయి ఆడిన శివమ్ దూబే... వరల్డ్ కప్ టీమ్ లో సెలెక్ట్ ఐనా తరువాత మాత్రం పిల్లిలా ఆడుతున్నాడని ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. లాస్ట్ 4 మ్యాచుల్లో అతడు కొట్టి స్కోర్ చూస్తే కూడా అదే అర్థమవుతోంది. అసలు..చెన్నై సూపర్ కింగ్స్ కానీ, టీం ఇండియాగానీ శివమ్ దూబే ను ఎలా చుస్తుందంటే... అతడిని స్ట్రైక్ రోటెటర్ గా కాదు.. సూపర్ స్ట్రైకర్ గా చూస్తుంది. అంటే.. మ్యాచులో 30 నుంచి 50 పరుగులు కొట్టాలి. సెటిల్ అవ్వాలి. అవతలి ఎండ్ బ్యాట్స్ మెన్ తో పార్ట్ నర్ షిప్ బిల్డ్ చేయాలి వంటివి కాదు. మిడిల్ ఓవర్స్ 7 నుంచి 15 మధ్యలో శివవ్ వచ్చి కొట్టే ఆడిన 4 బాల్స్ ఐనా సరే రెండు,మూడు బౌండరీలు ఉండాలి. స్ట్రైక్ రేట్ 180 ప్లస్ 200 ప్లస్ ఉండాలి. కొట్టిన 20 పరుగులు ఐనా ఇన్నింగ్స్ లో వేగం పెంచాలి. అందుకే శివమ్ ను తీసుకునేది. కానీ, మనోడు ఆ రేంజ్ లో ఫర్మామెన్స్ ఇవ్వకపోవడంతోనే ఇప్పుడు చెన్నై ఇంటి బాట పట్టాల్సి వచ్చింది.