Security Threat to Virat Kohli | ఎలిమినేటర్ మ్యాచ్ కు ముందే ప్రాక్టీస్ ఆపేసిన కొహ్లీ | ABP Desam

ఆర్సీబీ ని ఎలిమినేటర్ మ్యాచ్ లో గెలిపించటం ద్వారా క్వాలిఫైయర్ 2 మ్యాచ్ కు తీసుకెళ్లాలని కష్టపడుతున్న స్టార్ బ్యాటర్ విరాట్ కొహ్లీ ప్రాణాలకే ముప్పు ఉందా. అవును అందుకే కొహ్లీ ప్రాక్టీస్ సైతం ఆపేశాడు. ఎలిమినేటర్ మ్యాచ్ కి ముందు జరిగింది ఈ ఘటన. అహ్మదాబాద్ లో ఈరోజు ఆర్సీబీ కి రాజస్థాన్ రాయల్స్ కి మధ్య ఎలిమినేటర్ మ్యాచ్ జరుగుతుండగా నిన్న ప్రాక్టీస్ సెషన్ కు కొహ్లీ హాజరు కాలేదు. అహ్మదాబాద్ లో విరాట్ కొహ్లీకి సెక్యూరిటీ థ్రెట్ ఉందని ఇంటెలిజెన్స్ ఉంది సమాచారంతో పోలీసులు ఆర్సీబీ యాజమాన్యానికి సమాచారం అందించారు. స్టేడియం, ఆటగాళ్ల హోటల్ గదుల వద్ద భద్రతను కట్టుదిట్టం చేయటంతో పాటు కొహ్లీని ప్రాక్టీస్ చేయొద్దని సూచించారు. దీంతో విరాట్ హోటల్ గదికే పరిమితమైపోయాడు. ఆర్సీబీలో చాలా మంది ఆటగాళ్లు ప్రాక్టీస్ సెషన్ కు రాలేదు. రాజస్థాన్ రాయల్స్ కి ఇదే రకమైన హెచ్చరికలు జారీ చేసినా వాళ్లు మాత్రం ప్రాక్టీస్ చేసినట్లు తెలుస్తోంది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola