Sai Sudharsan Batting IPL 2025 | 30 మ్యాచులుగా వీడిని డకౌట్ చేసిన మగాడే లేడు

Continues below advertisement

 నో పబ్లిసిటీ..నో హైప్...రిచ్ కిడ్ కాదు. లెజెండ్స్ సపోర్ట్ లేదు.  పీఆర్ టీమ్స్ లేవు పబ్లిసిటీ చేసి పెట్టటానికి. ఈవెన్ మా కళ్లకు కూడా ఆనలేదు. కానీ రికార్డులు చూస్తే మైండ్ బ్లోయింగ్. పేరు సాయి సుదర్శన్ . వయస్సు 23 ఏళ్లు. ఓ సాదీ సీదా సౌత్ చెన్నై కుర్రోడు. కానీ 30 మ్యాచులుగా కనీసం డకౌట్ చేయలేకపోయారు అతన్ని. లాస్ట్ పది మ్యాచుల్లో 5 హాఫ్ సెంచరీలు..ఓ సెంచరీ ఉంది. సింగిల్ డిజిట్ స్కోర్లకు రెండు సార్లు మాత్రమే ఔటయ్యాడు. ఇంత కన్సిస్టెన్సీ ఆడుతున్న ఆటగాడు రీసెంట్ టైమ్ లో మరొకడు లేడేమో. 2022 లో ఐపీఎల్ ఆడటం మొదలు పెట్టిన సాయి సుదర్శన్. 2023లో 8 మ్యాచులు మాత్రమే ఆడి 3 హాఫ్ సెంచరీలు కొట్టాడు. 2024 లో రెండు హాఫ్ సెంచరీలు...ఓ సెంచరీతో 527 పరుగులు చేశాడు. ఈ సీజన్ లో ఆడింది 5 మ్యాచులు 3 హాఫ్ సెంచరీలు కొట్టాడు. నిన్న రాజస్థాన్ రాయల్స్ ను ఓ ఆటాడుకున్నాడు. టాస్ గెలిచి బౌలింగ్ తీసుకున్న రాజస్థాన్ కు గిల్ వికెట్ తీసిన ఆనందాన్ని ఎంతో సేపు మిగల్చ లేదు సాయి సుదర్శన్. ముందు జోస్ బట్లర్ తో తర్వాత షారూఖ్ ఖాన్ తో కలిసి RR ను రఫ్పాడించాడు. 32 బాల్స్ లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసిన సాయి..మొత్తంగా 53 బాల్స్ ఆడి 8 ఫోర్లు 3 భారీ సిక్సర్లతో 82పరుగులు చేసి దేశ్ పాండే బౌలింగ్ లో అవుటయ్యాడు. సీజన్ లో మూడోహాఫ్ సెంచరీ బాది తన టీమ్ 217పరుగులు స్కోర్ చేయటంలో కీలక పాత్ర పోషించాడు సాయి సుదర్శన్. లాస్ట్ 30 ఐపీఎల్ మ్యాచుల్లో ఒక్కసారి కూడా డకౌట్ అవ్వకుండా.. 1307 పరుగులు చేసి క్రిస్ గేల్ పేరు మీదున్న రికార్డును కూడా దాటేసి 30 మ్యాచుల్లో అత్యధిక పరుగులు చేసిన ఆటగాళ్ల జాబితాలో రెండో స్థానంలో నిల్చున్నాడు. సుదర్శన్ కంటే పైన షాన్ మార్ష్ మాత్రమే ఉన్నాడు. ఆ రేంజ్ లో ఎదురే లేదన్నట్లు దూసుకుపోతున్నాడు. నిజంగా కొంచెం మీడియా లైమ్ లైట్ ఇస్తే టీమిండియా కు ఆడదగిన స్థాయి ఉన్న కుర్రోడు కచ్చితంగా.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola