Sai Sudharsan 52 vs KKR IPL 2025 | నిలకడకు మారు పేరు..సురేశ్ రైనా ను తలపించే తీరు

Continues below advertisement

 మనకు మిస్టర్ ఐపీఎల్ అనగానే గుర్తొచ్చేది ఎవరు సురేశ్ రైనా. అంతలా టీ20 ఫార్మాట్ మీద ఐపీఎల్ లీగ్ మీద చెరగని మద్రవేశాడు సురేశ్ రైనా. ఇన్నేళ్ల తర్వాత మళ్లీ ఇంకో మిస్టర్ ఐపీఎల్ పుట్టొకొచ్చాడా అనిపించక మానట్లేదు. ఈ బ్యాటర్ ని చూస్తుంటే. పేరు సాయి సుదర్శన్. గుజరాత్ టైటాన్స్ తరపున ఓపెనింగ్ చేసే సాయి సుదర్శన్ లెఫ్ట్ హ్యాండ్ బ్యాటింగ్ అచ్చం సురేశ్ రైనా తలపిస్తూ అద్భుతమైన నిలకడ, కన్సిస్టెన్సీ తో ఈ ఐపీఎల్ సీజన్ లోనూ పరుగుల వరద పారిస్తున్నాడు. నిన్న కోల్ కతా నైట్ రైడర్స్ తో జరిగిన మ్యాచ్ లో 36 బంతుల్లో 6 ఫోర్లు ఓ సిక్స్ తో 52పరుగులు చేసి సాయి సుదర్శన్..ఈ సీజన్ లో ఏకంగా ఐదో హాఫ్ సెంచరీ సాధించాడు. అంటే ఆడిన 8 ఎనిమిది మ్యాచ్ ల్లో ఐదు హాఫ్ సెంచరీలున్నాయి. ఇది మాములు ఫీట్ కాదు. ఐపీఎల్ లాంటి టీ20 లీగ్ లో 50+ యావరేజ్ తో  152 స్ట్రైక్ రేట్ తో సీజన్ సగం ముగిసేటప్పటికే 417 పరుగులు చేశాడు. ప్రస్తుతం ఆరెంజ్ క్యాప్ సాయి సుదర్శన్ దగ్గరే ఉంది. 2022 లో ఐపీఎల్ డెబ్యూ చేసిన ఈ 24 ఏళ్ల కుర్రాడు...మూడేళ్లుగా స్ట్రాంగ్ ఫర్ ఫర్మానెస్స్ తో అదరగొడుతున్నాడు. అందుకే 2022లో 20 లక్షలు మాత్రమే పలికిన సుదర్శన్ ఈ ఏడాది ఐపీఎల్ కోసం 8 కోట్లు పెట్టి మరీ రీటైన్ చేసుకుంది. తన జట్టు నమ్మకాన్ని నిలబెడుతూ నిలకడగా హాఫ్ సెంచరీల మీద హాఫ్ సెంచరీలు బాదుతున్న సాయి సుదర్శన్ ఇదే జోరు మిగిలిన మ్యాచుల్లోనూ కొనసాగిస్తే...ఐపీఎల్లో గుజరాత్ కి రెండో టైటిల్ అందించే లక్ష్యం నెరవేరటంతో పాటు వ్యక్తిగతంగా టీమిండియా లో రెగ్యులర్ మెంబర్ అయ్యే అవకాశాలు గట్టిగా కనిపిస్తున్నాయి.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola