RR vs RCB Eliminator | IPL 2024 | రాజస్థాన్ తో ఎలిమినేటర్స్ మ్యాచులో RCBకే SRH ఫ్యాన్స్ సపోర్ట్ |

ఐపీఎల్ లో మరో ఇంట్రెస్టింగ్ మ్యాచ్ కు సమయం వచ్చేసింది. ఈ రోజు రాజస్థాన్ తో బెంగళూరు ఎలిమినేటర్ మ్యాచ్‌లో తలపడనుంది.

క్వాలిఫైయర్ 1లో కేకేఆర్ చేతిలో SRH ఎవరి వల్ల ఓడిపోయిందో తెలుసా...! మిచెల్ స్టార్క్..! యస్.. ఈ ఆరు అడుగుల స్పీడ్ గన్ వల్లే హైదరాబాద్ ఓడిపోయింది. మిచెల్ స్టార్క్ కోసం కేకేఆర్ మేనేజ్మెంట్ 24 కోట్లకుపైగా పెట్టి కొనుక్కుంది. కానీ, అతడు ఈ ఐపీఎల్ లో పెద్దగా ఆడింది ఏమి లేదు. ముంబయితో జరిగిన మ్యాచులో 4 వికెట్లు తీశాడు తప్పా...స్థాయికి తగ్గట్లు ఏ రోజు ఆడలేదు. కేకేఆర్ ఫ్యాన్స్ అంతా పైసలు దండుగా అనుకున్నారు.  కానీ, కీలకమైన క్వాలిఫైయర్స్ లో మాత్రం పైసా వసూల్ అన్నట్లుగా చెలరేగిపోయాడు. పవర్ ప్లేలోనే 3 ఓవర్లు వేసిన స్టార్క్..కేవలం 22 పరుగులు ఇచ్చి కీలకమైన 3 వికెట్లు తీసుకున్నాడు. ఇన్నింగ్స్ 2వ బాల్ కే ట్రావెస్ హెడ్ ను బౌల్డ్ చేయడం మొత్తం మ్యాచ్ కే హైలైట్ అని చెప్పుకోవాలి. ఆ తరువాత నితీశ్ రెడ్డి , షాబాద్ అహ్మద్ ల వికెట్లు తీసుకున్నాడు. SRHకు బలమే పవర్ ప్లే..! పవర్ ప్లేలోనే సుమారు 100 పరుగులు చేస్తే... మిగతా 14 ఓవర్లలో ఒత్తిడి లేకుండా ఆడుకోవచ్చు. ఇదే కెప్టెన్ కమిన్స్ గేమ్ ప్లాన్. కానీ, ఆ ఆస్ట్రేలియన్ బుర్ర ఏంటో తెలిసిన స్టార్క్... పవర్ ప్లేలోనే 3 వికెట్లు తీసుకుని SRHను చావుదెబ్బ కొట్టాడు. అలా... ఇన్నాళ్లు ఫామ్ లో లేనట్లు కనిపించిన స్టార్క్... కీలకమైన మ్యాచులో ఫామ్ లోకి రావడం...మరి ముఖ్యంగా టీ20 వరల్డ్ కప్ ముంద డెంజర్ బెల్స్ మోగించడం ఇప్పుడు ఆసక్తికరంగా మారింది.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola