Rishabh Pant Runs and Catches vs Pak | Ind vs Pak మ్యాచ్ లో కీలకంగా రాణించిన పంత్ | T20 World Cup24
లో స్కోర్ థ్రిల్లర్స్ లో ప్రతీది కీలకమే. తీసే ప్రతీ పరుగు ఇంపార్టెంట్. పట్టే ప్రతీ క్యాచ్...ఔట్ చేసే ప్రతీ బాల్. నిన్న పాకిస్థాన్ మ్యాచ్ లో అదే జరిగింది. మొదట బ్యాటింగ్ చేసిన భారత్ వర్షం పడిన టర్నింగ్ పిచ్ పై వికెట్లు టపా టపా కోల్పోయింది. అయినా పిచ్ లకు అందని పోటు గాడు రిషబ్ పంత్ తనదైన శైలిలో ఆడేశాడు. బంతి బ్యాట్ మీదకు రాకున్నప్పటికీ తనకి వచ్చిన షాట్స్ ను అడ్డంగా దిడ్డంగా ఆడేస్తూ పరుగులు అయితే రాబట్టాడు. భారత్ 119పరుగులు చేస్తే అందులో పంత్ కొట్టినవే 42పరుగులు. అతనే హయ్యెస్ట్ స్కోరర్ నిన్న. అక్కడితే అయిపోలేదు వికెట్ కీపింగ్ లోనూ తన స్కిల్స్ చూపించాడు పంత్. స్ట్రెచింగ్, రన్నింగ్, క్యాచింగ్ ఇలా మూడు వికెట్ కీపింగ్ విభాగాలను పర్ఫెక్ట్ గా ఎక్స్ క్యూట్ చేస్తూ పాకిస్థాన్ వికెట్లు పడగొట్టడంతో హెల్ప్ అయ్యాడు పంత్. హార్దిక్ పాండ్యా తీసిన రెండు వికెట్లు ఫకార్ జమాన్ అండ్ షాదాబ్ ఖాన్ ల క్యాచ్ లు పట్టుకుంది రిషభ్ పంతే. ఫకర్ జమాన్ ది అయితే హైలెట్ క్యాచ్ అసలు. పాండ్యా విసిరిన షార్ట్ పిచ్ బాల్ లాంటి ది టాప్ ఎడ్జ్ తీసుకుని గాల్లోకి లేస్తే పంత్ వికెట్లగా వెనగ్గా వెళ్తున్న వదలకుండా డైవ్ కొట్టాడు. ఆ టైమ్ లో తన హెల్మెట్ అక్కడే నేల మీద ఉన్నా అది డొక్కలో గుద్దుకునే ప్రమాదం ఉన్నా రిస్క్ చేసేశాడు. జాగ్రత్తగా బ్యాలెన్స్ చేస్తూ హెల్మెట్ కి తగలకుండా గాల్లో స్ట్రెచ్ చేస్తూ డైవ్ కొట్టిన పంత్ అందరితోనూ వావ్ అనిపించాడు. అర్ష్ దీప్ బౌలింగ్ లో ఇమాద్ వసీమ్ క్యాచ్ కూడా పంతే పట్టుకున్నాడు. అలా బ్యాటింగ్ లో 42పరుగులు..ఫీల్డింగ్ లో వికెట్ కీపర్ గా మూడు క్యాచులు పట్టుకుని టీమిండియాను లో స్కోర్ థ్రిల్లర్ లో గెలిచిపించటంలో కీలకపాత్ర పోషించాడు రిషభ్ పంత్.