Rishabh Pant IPL 2025 Failures | 27కోట్లు పెట్టి కొంటే అర్థ రూపాయి ఉపయోగపడలేదు
రిషభ్ పంత్. మోస్ట్ వ్యాల్యుబుల్ ప్లేయర్ ఐపీఎల్ హిస్టరీలోనే. ఎందుకంటే మొన్న ఆక్షన్ లో ఏకంగా LSG పంత్ ను 27 కోట్ల రూపాయలు పెట్టి కొనుక్కుంది.18ఏళ్ల ఐపీఎల్ చరిత్రలోనే ఓ ఆటగాడికి దక్కిన అత్యంత పెద్ద మొత్తం ఇది. మరింత పంత్ మీద పెడితే పంత్ ఏం చేశాడో తెలుసా...ఎనిమిదేళ్ల తన ఐపీఎల్ కెరీర్ లో ఎప్పుడూ ఆడనంత చెత్తగా ఆడాడు. ఈ సీజన్ లో 12 మ్యాచ్ లు ఆడిన పంత్...కేవలం 135పరుగులు మాత్రమే చేశాడు. యావరేజ్ 12. పంత్ కెరీర్ లోనే అత్యంత చెత్త రికార్డ్ ఇది. 2106లో అరంగేట్రం చేసిన దగ్గర నుంచి పంత్ ఇంత తక్కువ పరుగులు ఏ సీజన్ లోనూ చేయలేదు. పైగా LSG కెప్టెన్ గా ఉన్న పంత్ ఒక్క మ్యాచ్ లో హాఫ్ సెంచరీ చేయటం మినహా మరే మ్యాచ్ లోనూ సింగిల్ డిజిట్లు కూడా దాటకపోవటంతో ఆ ప్రభావం టీమ్ పై విపరీతంగా పడింది. టాప్ 3 బ్యాటర్లైన మిచ్ మార్ష్, మార్ క్రమ్, పూరన్ ఆడకపోతే LSG మ్యాచ్ ఓడిపోవాల్సిన పరిస్థితులను పంత్ ఏర్పాటు చేశాడు. అతి ఎక్కువ ధర పెట్టినప్పుడు పంత్ ను కొన్నప్పుడు సంజీవ్ గోయెంకా లో కనిపించిన కసి పంత్ ఇంత దారుణంగా ఫెయిల్ అవ్వటంతో పాపం ఆయనకు నోట మాట లేదు. అయితే మీమ్స్ లో మాత్రం పంత్ కేఎల్ రాహుల్ పగను పంచుకున్నాడంటూ వైరల్ చేస్తున్నారు. గత సీజన్ లో కెప్టెన్ గా ఉన్న రాహుల్ ను గ్రౌండ్ లోనే గోయెంకా తిట్టడం..రాహుల్ LSG ని వదిలిపెట్టడం ఢిల్లీకి మారిపోవటం..రాహుల్ ప్లేస్ లో పంత్ రావటం జరిగాయి. ఇప్పుడు తన సహచరుడు రాహుల్ ని తిట్టిన గోయెంకా అదిరిపడేలా చెత్త ఫర్ ఫార్మెన్స్ ఇచ్చి రాహుల్ పగను పంత్ షేర్ చేసుకున్నాడంటూ సరదాగా వైరల్ చేస్తున్నారు మీమర్స్.