Rishabh Pant Failures in IPL 2025 | LSG vs MI మ్యాచులోనూ చెత్తగా అవుటైన పంత్

Continues below advertisement

 రిషభ్ పంత్ అదృష్టం బాగుంది అనుకోవాలో..దరిద్రంలో ఉన్నాడు అనుకోవాలో అర్థం కావట్లేదు. పాపం ఎంత ట్రై చేసినా ఓ భారీ ఇన్నింగ్స్ పంత్ నుంచి రాలేకపోతోంది. ఈ ఐపీఎల్  సీజన్లో నాలుగు మ్యాచ్ లు ఆడిన పంత్ కేవలం 19 పరుగులు మాత్రమే చేశాడు. యావరేజ్ 4, స్ట్రైక్ రేట్ 59గా ఉంది. వరుస మ్యాచుల్లో 0,15,2,2 పరుగులకు అవుటైపోయాడు రిషభ్ పంత్. ప్రత్యేకించి పంత్ గురించే మాట్లాడుకోవటానికి ఓ రీజన్ ఉంది. గతేడాది జరిగిన వేలంలో రిషభ్ పంత్ అందరికంటే ఎక్కువగా 27కోట్ల రూపాయలు పెట్టి కొన్నారు లక్నో సూపర్ జెయింట్స్ యాజమాన్యం. గతేడాది మ్యాచ్ లు సరిగ్గా ఆడటం లేదని కేఎల్ రాహుల్ ను గ్రౌండ్ లో తిట్టిన గోయెంకా..ఈసారి మాత్రం రిషభ్ పంత్ తో మాట్లాడేప్పుడు జాగ్రత్తగా మాట్లాడుతున్నాడు గోయెంకా. ఎక్కడైనా కోప్పడినట్లో అరచినట్లో వస్తే అది సోషల్ మీడియాలో వైరల్ అవుతుందని బ్రాండ్ ఇమేజ్ కు నష్టమని LSG యాజమాన్యం భావిస్తోంది.  అందుకే కూల్ గా డీల్ చేస్తున్నారు. అయితే పంత్ స్కోర్లు రోజు రోజుకు తీసికట్టుగా ఉండటం కూడా LSG కి పెద్ద ఇబ్బందే. వరుసగా రెండు మ్యాచుల్లో గెలిచారు కాబట్టి ఓకే కానీ లేదంటే అన్ని కోట్లు పోసి కొనుక్కుంటే సింగిల్ డిజిట్ స్కోర్లకు అవుట్ అవుతుంటే ఏ ఓనర్ కైనా ఒళ్లు మండిపోద్ది మరి. త్వరగా పంత్ ఈ పూర్ ఫామ్ నుంచి బయటకు రావాలని స్పైడీ ఆటతీరుతో చితక్కొట్టేయాలని రిషభ్ ఫ్యాన్స్ కోరుకుంటున్నారు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola