RCB vs SRH Match Preview IPL 2025 | నేడు సన్ రైజర్స్ హైదరాబాద్ తో ఆర్సీబీ ఢీ
ఈ ఐపీఎల్ సీజన్ లో ప్లే ఆఫ్స్ బెర్తులు ఖరారు అయిపోయాయి. మిగిలిన టీమ్స్ అస్సాం ట్రైనూ ఎక్కేశాయి. అయితే ఇంకా తేలాల్సింది ఒకటి ఉంది. అదే టాప్ 2 ఎవరూ అని. తెలుసుగా టాప్ 2 లో ఉంటే ప్లే ఆఫ్స్ లో రెండు ఛాన్సులు ఉంటే..ప్లే ఆఫ్ 1 మ్యాచ్ లో ఓడినా కూడా ప్లే ఆఫ్ 2 లో ఎలిమినేటర్ విజేతగా నిలిచే జట్టుతో మరోసారి అదృష్టాన్ని పరీక్షించుకునే అవకాశం ఉంటుంది. అందుకే పాయింట్స్ టేబుల్ లో టాప్ 2 లో ప్లేస్ కోసం నాలుగు టీమ్స్ గట్టిగానే పోటీ పడతాయి. అయితే ఈ టీమ్స్ లో ఎక్కువగా టాప్ 2 పొజిషన్ నిలబెట్టుకునే అవకాశం ఉన్న జట్టుగా కనపడుతున్న RCB..గ్రౌండ్ లోనూ ఆ బలాన్ని నిరూపించుకోవాలని తాపత్రయపడుతోంది. ఈ రోజు సన్ రైజర్స్ హైదరాబాద్ తో ఉన్న మ్యాచ్ లో ఆర్సీబీ టార్గెట్ అదే. ఈ మ్యాచ్ గెలిస్తే ఆర్సీబీ 19 పాయింట్లతో టేబుల్ టాపర్ పొజిషన్ కి వెళ్తుంది. ఇంకో మ్యాచ్ ఉంది కాబట్టి అది కూడా గెలిస్తే 21 పాయింట్లతో టాప్ 2 లో ప్లేస్ పక్కా. 21 పాయింట్లు గెలుచుకునే ఛాన్స్ ఆర్సీబీ తో పాటు పంజాబ్ కి మాత్రమే ఉండటంతో కచ్చితంగా అదే టార్గెట్ పెట్టుకుని ఆడుతుంది ఆర్సీబీ. మరి ఈ ఐపీఎల్ సీజన్ నుంచి ఎలిమినేట్ అయినా కూడా స్ట్రాంగెస్ట్ టీమ్ అయిన సన్ రైజర్స్ ఆర్సీబీ ని ఆ టాస్క్ ఎచీవ్ చేయకుండా ఆపటానికి ట్రై చేయొచ్చు. వాస్తవానికి బెంగుళూరులో జరగాల్సిన ఈ రోజు మ్యాచ్ భారీ వర్షాల కారణంగా లక్నో ఎకానా స్టేడియానికి షిఫ్ట్ అయ్యింది. సో ఆర్సీబీ ని లక్నోను ఇవాళ హోం గ్రౌండ్ గా మార్చుకుని ఈ మ్యాచ్ ఆడనుంది. రేర్ గా వచ్చే సందర్భం ఇది. అయితే ఆర్సీబీకి ఉన్న బలం ఏంటంటే ఈ సీజన్ లో హోం గ్రౌండ్ బయట ఆడిన మ్యాచుల్లో వరుసగా ఆరు విజయాలు నమోదు చేసి తిరుగు లేని రికార్డు కొట్టింది. అదే సమయంలో హోం గ్రౌండ్ లో మూడు మ్యాచుల్లో వరుసగా ఓడిపోయింది. మరి లక్నో బయట గ్రౌండ్ కాబట్టి గెలుస్తుందా...ఈ మ్యాచ్ వరకూ పేపర్ పై లక్నో హౌం గ్రౌండ్ కాబట్టి ఓడిపోతుందా...సన్ రైజర్స్ ఏం చేస్తుంది..ఈ రోజు జరిగే మ్యాచ్ అయితే ఇంట్రెస్టింగ్ గా ఉండనుంది. ఆర్సీబీ కెప్టెన్ రజత్ పాటిదార్ గాయం నుంచి కోలుకున్నాడు. హేజిల్ వుడ్ లేకపోవటంతో భువీ పైనే బౌలింగ్ భారం అంతా పడనుంది. సన్ రైజర్స్ లో కూడా ట్రావియెస్ హెడ్ కొవిడ్ లక్షణాలతో బాధపడుతున్నాడు అన్నారు మరి ఈరోజు మ్యాచ్ ఆడతాడా లేదా ఇప్పటివరకైతే క్లారిటీ ఇవ్వలేదు.