RCB vs RR Match Highlights IPL 2025 | పట్టు బిగించి చివర్లో మ్యాచ్ ను లాగేసుకున్న ఆర్సీబీ | ABP Desam
హోం గ్రౌండ్ లో మ్యాచ్ లు గెలవలేదు. హోం గ్రౌండ్ లో మ్యాచ్ లు గెలవలేనే గెలవలేదు. ముందు హోం గ్రౌండ్ లో మ్యాచ్ లు గెలవండిరా. ఐపీఎల్ మొదలైన దగ్గర నుంచి ఒకటే మోత. అరే బయట ఐదు మ్యాచులు ఆడితే ఐదుకు ఐదు మ్యాచ్ లు గెలిచి ముంబై, చెన్నై అంటూ అందరికీ సౌండ్ ఆఫ్ చేసిన ఆర్సీబీ పై ఒకటే ట్రోలింగ్. నిన్నటితో అన్నింటికీ సమాధానం చెప్పేశారు కింగ్ కొహ్లీ అండ్ టీమ్. ఎత్తిన ప్రతీ వేలు ముడుచుకోవాలి..జారిన ప్రతీ నోరూ మూసుకోవాలి అంతే. అసలు నిన్న కూడా గట్టిగా మాట్లాడితే మ్యాచ్ రాజస్థాన్ దే. ఆర్సీబీ ఇచ్చిన 206 పరుగుల టార్గెట్ ను ఛేజ్ చేసే క్రమంలో 9ఓవర్లకే 110 కొట్టారు రాజస్థాన్ బ్యాటర్లు. ఇక 11 ఓవర్లలో 96 కొడితే చాలు. చేతిలో 8వికెట్లున్నాయి. కానీ ఒక్కో వికెట్టునూ లెక్కబెడుతూ తీసింది ఆర్సీబీ. ముందు కృనాల్ స్పిన్ ఉచ్చులో రాజస్థాన్ ను బిగించి పడితే..హేజిల్ వుడ్ వచ్చి RR ప్లే ఆఫ్ కలలను చావు దెబ్బ తీశాడు. అంతెందుకు ఆఖరి 12 బంతుల్లో 18 పరుగులు చేస్తే రాజస్థాన్ గెలుస్తుందన్నా కూడా ఆడటానికి సరైన బ్యాటరే లేకుండా చేసి సగర్వంగా చిన్నస్వామిలో విజయాన్ని అందుకుంది ఆర్సీబీ. 194 పరుగులకే పరిమితమైంది రాజస్థాన్. ఆర్సీబీ 11 పరుగుల తేడాతో విజయం సాధించటంతో పాటు 12 పాయింట్లతో ప్లే ఆఫ్ రేసులో బలమైన కంటెండర్ గా నిలబడింది పటీదార్ సేన.