RCB vs CSK Highlights | Ravindra Jadeja | సర్ జడేజా... నువ్వు లాస్ట్ 2 బాల్స్ ఎందుకు కొట్టలేదు సర్..

Continues below advertisement

RCB vs CSK Highlights | Ravindra Jadeja |CSK ప్లే ఆప్స్ లో అడుగుపెట్టాలంటే 2 బాల్స్ లో 10 పరుగులు కొట్టాలి. ఇది ఏ బ్యాట్స్ మెన్ కు ఐనా కష్టమనే చెప్పుకోవాలి. కానీ, క్రీజులో ఉన్నది రవీంద్ర జడేజా. దీంతో... ఫ్యాన్స్ లెక్కలన్నీ మారిపోయాయి. కట్ చేస్తే 2023 ఫైనల్ ఫ్లాష్ బ్యాక్ లోకి వెళ్లిపోయారు ఫ్యాన్స్. గుజరాత్ తరపున మోహిత్ శర్మ లాస్ట్ ఓవర్ వేస్తున్నాడు. సేమ్ 2 బాల్స్ లో 10 పరుగులు కావాలి. జడేజా ఒక సి క్సు, ఫోర్ కొట్టి గెలిపించి చెన్నై పాలిట దేవుడిలా మారాడు. సరిగ్గా అదే సిచ్యూవేషన్ నిన్న చెన్నైతో వచ్చింది. అప్పటికే 20 బాల్స్ లో 3 సి క్సులు, 3 ఫోర్లు కొట్టి 42 పరుగులతో  ఊపుమీదున్నాడు జడేజా. దీంతో.. లాస్ట్ ఇయర్ లాగే ఇప్పుడు చెన్నైని గట్టెక్కిస్తారని ఫ్యాన్స్ ఆశించారు. కానీ సీన్ రివర్స్ ఐంది. బౌండరీ కాదు కదా కనీసం ఒక్క బాల్ కూడా టచ్ చేయలేదు. యశ్ దయాల్ వేసిన స్లో బాల్స్ ని టచ్ చేయలేకపోయాడు జడేజా. దీంతో... ఒకే పరిస్థితి రెండు సార్లు ఎదురైతే... 2023లో హీరోగా నిలిస్తే.. ఇప్పుడు జీరోగా నిలిచాడు అంటూ రవీంద్ర జడేజాపై ఫ్యాన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ఐనప్పటికీ.. 2 బాల్స్ 10 పరుగులు ఏ బ్యాటర్ కైనా కష్టం. అలాంటింది... జడేజా ప్రతిసారి ఆ మ్యాజిర్ రిపీట్ చేయాలంటే అసాధ్యమనే చెప్పుకోవాలి. అందుకే నిన్న ఆర్సీబీ మ్యాచులో ఊపుమీద ఉన్నప్పటికీ.. చెన్నైకి ప్లే ఆఫ్స్ కు చేర్చలేకపోయాడు.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram