RCB Playoffs IPL 2025 | కొహ్లీ కల..ఆర్సీబీ అభిమానుల కోరిక..ఈ సాలా కప్ నమ్మదేనా
ఆరేళ్లుగా కన్సిస్టెన్సీ కి కేరాఫ్ అడ్రస్ లా ఐపీఎల్ దుమ్మురేపుతున్న ఆర్సీబీ మరోసారి ప్లే ఆఫ్స్ కి నేను రెడీ అంటూ వచ్చేసింది. నిన్న గుజరాత్ టైటాన్స్ గెలుపుతో ఆర్సీబీ ప్లే ఆఫ్స్ ఫిక్స్ అయ్యిపోయింది. 2020 నుంచి వరుసగా ప్లే ఆఫ్స్ ఆడుతున్న ఆర్సీబీ 2023 సీజన్ ను మినహాయిస్తే….ఇది ఆరేళ్లలో ఐదోసారి ప్లేఆఫ్స్ కి వెళ్లటం. ముందు ఆర్సీబీ సాధించాల్సింది టాప్ 2 లో కచ్చితమైన ప్లేస్. రీజన్ టాప్ 2లో ఉంటే ప్లే ఆఫ్స్ 1 ఆడి ఓడినా ప్లే ఆఫ్స్ 2 ఆడటానికి ఛాన్స్ ఉంటుంది. ఎలిమినేటర్ లో గెలిచిన జట్టుతో తలపడి ఫైనల్ కి వెళ్లేందుకు రెండో ఛాన్స్ తీసుకోవచ్చు. సో ఆర్సీబీకి మిగిలి ఉన్న సన్ రైజర్స్, లక్నో మ్యాచ్ లు గెలవటం చాలా అవసరం. పైగా వాళ్లున్న ఫామ్ కి అది ఈజీగా కూడా కనిపిస్తోంది. ప్రధానంగా విరాట్ కొహ్లీపైనే ఇప్పుడు అన్ని కళ్లూ ఉన్నాయి. ఐపీఎల్ లో టీ20 లు, టీమిండియాకు వన్డేలు తప్ప కొహ్లీ కెరీర్ లో ఇంకేం మిగల్లేదు. టెస్టులకు రిటైర్మెంట్ ప్రకటించిన విరాట్ ఇక పూర్తిగా ఈ రెండింటిపైనే ఫోకస్ చేయనున్నాడు. పైగా ఐపీఎల్ ట్రోఫీ ఆర్సీబీకి 18ఏళ్ల కల. సో దాన్ని ఈసారి ఎలా అయినా తీర్చుకోవాలని వచ్చిన ఛాన్స్ వదిలిపెట్టకూడదని ఆర్సీబీ కచ్చితంగా భావిస్తుంది. చూడాలి మరి ఈసాలా అయినా కప్ నమ్మదేనో కాదో.