RCB Fans Celebrations IPL 2025 Win | దేశవ్యాప్తంగా సంబరాల్లో మునిగిపోయిన ఆర్సీబీ అభిమానులు
18ఏళ్ల పాటు ఐపీఎల్ ట్రోఫీ కోసం ఎదురు చూసిన కసి, ఆ పట్టుదల అన్నీ ఒక్క రోజుతో పంటా పంచలు అయిపోయాయి. పంజాబ్ పై 6పరుగుల తేడాతో ఫైనల్ మ్యాచ్ లో అద్భుత విజయం సాధించిన ఆర్సీబీ ఐపీఎల్ ట్రోఫీని ముద్దాడి కింగ్ కొహ్లీకి ట్రిబ్యూట్ ఇస్తే..బయట దేశవ్యాప్తంగా ఆర్సీబీ అభిమానులు సంబరాల్లో మునిగిపోయారు. బెంగుళూరు, హైదరాబాద్, నాగపూర్, రాయ్ పూర్ అనే తేడా లేదు. రాష్ట్రంతో పనేలేదు. కింగ్ కొహ్లీకి అభిమాని అయిన ప్రతీ వాడు ఫుల్ టూ సెలబ్రేట్ చేశాడు విక్టరీని. అర్థరాత్రి దాటేవరకూ రోడ్లపై డ్యాన్సులు, డీజేలతో రచ్చ రచ్చ చేశారు. ఆర్సీబీ జెండాలు ఎగురేస్తూ బాణా సంచా కాలుస్తూ ధూం ధాం చేశారు. హైదరాబాద్ లోని తెలంగాణ సెక్రటేరియట్ దగ్గర వందలాది గా అభిమానులు భారీ ఎత్తున సంబరాలను నిర్వహించారు. బెంగుళూరు, హైదరాబాద్ లలో బాణా సంచాల వెలుగులతో ఆకాశమంతా పట్టపగలుగా మారిపోయింది. కింగ్ కొహ్లీకి సరైన ట్రిబ్యూట్ ఇచ్చేలా అభిమానులు ఈ సంబరాలను నిర్వహిస్తూ తెల్లవారు జాము వరకూ తమ జట్టు విజయాన్ని ఫుల్ గా సెలబ్రేట్ చేసుకున్నారు. ఈ విజువల్స్ ఇప్పుడు ఇంటర్నెట్ లో వైరల్ గా మారుతున్నాయి.