RCB 6 Away Matches Wins in Row | IPL 2025 లో సరికొత్త చరిత్రను సృష్టించి ఆర్సీబీ

Continues below advertisement

ఈ సీజన్ తో 18వ ఏడాదిలో  అడుగుపెట్టిన ఐపీఎల్... లీగ్ లో ఎన్నడూ జరగని ఓ అద్భుతాన్ని కింగ్ విరాట్ కొహ్లీ చేసి చూపించాడు. నిన్న కృనాల్ పాండ్యాతో కలిసి ఢిల్లీ మీద మ్యాచ్ ను గెలిపించిన విరాట్ కొహ్లీ...ఆర్సీబీ వరుసగా ఆరో మ్యాచ్ ను బయట గెలిచేలా చేశాడు. ఐపీఎల్ చరిత్రలోనే ఓ జట్టు తమ సొంతగడ్డపై కాకుండా బయటి వేదికల్లో ఆరు మ్యాచ్ లు వరుసగా గెలవటం ఇదే తొలిసారి. మొత్తం పది మ్యాచ్ లు ఆడిన ఆర్సీబీ అందులో 7 మ్యాచ్ ల్లో విజయం సాధించి 14 పాయింట్లతో ప్రస్తుతం పాయింట్స్ టేబుల్ లో టాప్ లో ఉంది ఆర్సీబీ. బెంగుళూరు జట్టు ఇప్పటి వరకూ మూడు మ్యాచుల్లో ఓడిపోగా గెలిచిన 7 మ్యాచుల్లో ఆరు బయటి వేదికలు . ఈ ఏడాది చెన్నై, ముంబై, ఢిల్లీ లాంటి జట్లకు షాక్ లు ఇస్తూ వాళ్ల సొంత గడ్డపైనే వాళ్లను ఓడించింది ఆర్సీబీ. అలా అప్రతిహతంగా దూసుకుపోతూ పెద్ద జట్లకు...ఛాంపియన్ జట్లు షాక్ లు ఇస్తూ షేక్ చేస్తోంది విరాట్ కొహ్లీ అండ్ టీమ్. ప్రస్తుతం ఆర్సీబీ ని చూస్తున్న ఫ్యాన్స్ అంతా 2016 సీజన్ ను గుర్తు చేసుకుంటున్నారు. కప్ గెలుచుకోవటాకి ఆర్సీబీ కి అదే అత్యుత్తమం కాగా...అప్పుడు రకరకాల కారణాలతో కప్పును సన్ రైజర్స్  చేతులో పెట్టింది ఆర్సీబీ. కానీ ఇప్పుడు ఆర్సీబీ చూపిస్తున్న దూకుడు..పైగా బయట ఆడిన అన్ని మ్యాచులు గెలిచిన ట్రాక్ రికార్డ్ అన్నీ ఆర్సీబీ ఫ్యాన్స్ ని ఈసాలా కప్ నమ్మదే అనేలా చేస్తున్నాయి.

Continues below advertisement

JOIN US ON

Whatsapp
Telegram
Continues below advertisement
Sponsored Links by Taboola