Rahul Tripathi Sits on Stairs | KKR vs SRH Highlights | రాహుల్ త్రిపాఠి రనౌట్.. ఎవరిది తప్పు..? |ABP

Rahul Tripathi Sits on Stairs | క్లాస్ లో ఎవడైనా ఆన్సర్ చెబుతాడు.. కానీ, ఎక్సామ్ లో రాసినోడే టాపర్ అవుతాడు. ఈ డైలాగ్ రాహుల్ త్రిపాఠికి ఫర్ ఫెక్ట్ గా suit అవుతుంది. లీగ్ మ్యాచ్ లలో ఎవడైనా ఆడతాడు..క్వాలిఫైయర్స్ లో ఆడేవాడే ఛాంపియన్ అవుతాడు రాహుల్ త్రిపాఠి లాగా. కేకేఆర్ తో క్వాలిఫైయర్స్ 1లో కీలకమైన బ్యాటర్లు హెడ్, అభిషేక్ శర్మ, క్లాసెన్ లు చేతులెత్తేసినా రాహుల్ త్రిపాఠి పట్టు వదల్లేదు. 35 బాల్స్ లోనే 7 ఫోర్లు, ఒక సిక్సర్ తో 55 పరుగులు చేశాడు. మరి ముఖ్యంగా పవర్ ప్లేలోనే 4 వికెట్లు పడితే..మరో వికెట్ పడకుండా క్లాసెన్ తో కలిసి 5వ వికెట్ కు 63పరుగుల పార్ట్ నర్ షిప్ బిల్డ్ చేయడంలో కీలక పాత్ర పోషించాడు. ఐతే..మంచి టచ్ లో కనిపించిన త్రిపాఠి దురదృష్టకర రితీలో అవుట్ అయ్యాడు. 14వ ఓవర్ లో సునీన్ నరైన్ బౌలింగ్ లో సమద్ పాయింట్ దిశగా ఓ షాట్ అడాడు. పాయింట్‌లో ఉన్న రస్సెల్‌ అద్బుతంగా డైవ్‌ చేస్తూ బాల్ ని పట్టుకుని..క్విక్ గా కీపర్‌కు త్రో చేశాడు. ఈ లోపే సమద్, త్రిపాఠిలు పిచ్ మధ్యలోకి వచ్చేశాడు. త్రిపాఠి రన్ కోసం ప్రయత్నించకపోయినప్పటి..సమ్మద్ నాన్ స్ట్రైక్ ఎండ్ కి పరుగెత్తుకురావడంతో త్రిపాఠి అవుట్ అయ్యాడు. దీంతో..రాహుల్ త్రిపాఠి ఎమోషనల్ అయ్యాడు. పెవిలియన్‌కు వెళ్లే క్రమంలో మెట్లపై కూర్చోని కన్నీరు పెట్టుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో ప్రస్తుతం వైరల్ గా మారింది. నువ్వు నీ శక్తికి మించి ఆడావు..బాధపడాల్సింది నువ్వు కాదు.. చేతులెత్తేసిన మిగతా బ్యాటర్లు..నిజంగా నువ్వు ఛాంప్ అంటూ SRH  ఫ్యాన్స్ రాహుల్ త్రిపాఠికి మద్దతుగా నిలుస్తున్నారు. 

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola