Preity Zinta Celebrations | PBKS vs KKR మ్యాచ్ లో ప్రీతి జింతా సెలబ్రేషన్స్ వైరల్

 అస్సలు మన చేతుల్లో లేదనుకున్న మ్యాచ్ ను గెలిస్తే వచ్చే మజానే వేరు కదా. ఆ ఆనందం ఎంత థ్రిల్లింగ్ గా ఉంటుందో నిన్న కేకేఆర్ పై సంచలన రీతిలో విజయం సాధించిన పంజాబ్ జట్టు సహ యజమాని ప్రీతి జింటాను అడిగితే కరెక్ట్ గా చెబుతారు. చిన్నపిల్లలాగా ఎగిరి గంతులేశారామే. మొదటగా పంజాబ్ టాస్ గెలిచి బ్యాటింగ్ చేసి 111 పరుగులకే కుప్పకూలిపోయింది. ఒక్కో వికెట్ పడుతూ ఉన్నప్పుడు ప్రీతిజింతా మొహంలో బాధ కొట్టొచ్చినట్లు కనిపించింది. 112 పరుగులే కదా కేకేఆర్ కి ఉన్న బ్యాటింగ్ డెప్త్ కి చాలా ఈజీ అనుకుని ఉంటారు ప్రీతి కూడా. కానీ పంజాబ్ బౌలర్లు అద్భుతమే చేశారు. ఒక్కో వికెట్ ఒక్కో వికెట్ లెక్కపెట్టుకుంటూ కేకేఆర్ ప్రమాదకరమైన బ్యాటర్లను అందరినీ డగౌట్ కి పంపిస్తూ నరాలు తెంపే ఉత్కంఠ భరితపోరులో కోల్ కతాను 95 పరుగులకే కుప్ప కూల్చి సంచలన విజయం సాధించారు. ఇక అంతే ప్రీతి జింతా భూమి మీద ఆగలేదు. ఎగిరి ఎగిరి గంతులేస్తూనే ఉన్నారు. గ్రౌండ్ లోకి పరుగెత్తుకుని వచ్చి మ్యాచ్ విజయానికి కారణమైన ఆటగాళ్లను, కోచింగ్ స్టాప్ ను పేరు పేరునా పలకరించారు. చాహల్, పాంటింగ్ లను అయితే హగ్ చేసుకుని మరీ తన హ్యాపీనెస్ ను చాటి చెప్పారు ప్రీతి జింతా. అచ్చం సన్ రైజర్స్ ఓనర్ కావ్యా మారన్ లానే ప్రీతి కూడా ఎక్స్ ప్రెసివ్ సంతోషం వచ్చినా బాధ వచ్చిన ఆమె ఫేస్ లో ఈజీగా కనిపించి పోతుంది. అలా 17ఏళ్లుగా ఓ కప్ కోసం ఎదురు చూస్తున్న ప్రీతి జింతా..ఈ సారి ఐపీఎల్ లో తన సహచర నటుడైన షారూఖ్ ఖాన్ టీమ్ డిఫెండింగ్ ఛాంపియన్  KKR కు షాక్ ఇచ్చారు కాబట్టి ఇన్నేళ్ల ప్రీతి ఎదురు చూపులకు పంజాబ్ ఏమన్నా ఫలితం ఇస్తుందేమో చూడాలి.

JOIN US ON

Whatsapp
Telegram
Sponsored Links by Taboola